Siddarth: సీఎం రేవంత్ రెడ్డిపై సిద్ధార్థ్ ఫైర్.. కాండోమ్స్ పట్టుకొని తిరిగా అంటూ ఆగ్రహం

Siddarth Counter To Revanth Reddy: భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. తాజాగా టికెట్ రేట్ల విషయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన షరతు గురించి సిద్ధార్థ్ రియాక్ట్ అయ్యారు. ఇన్ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి కౌంటర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 8, 2024, 08:05 PM IST
Siddarth: సీఎం రేవంత్ రెడ్డిపై సిద్ధార్థ్ ఫైర్.. కాండోమ్స్ పట్టుకొని తిరిగా అంటూ ఆగ్రహం

Siddharth comments on CM: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా.. ఒక షరతు పెట్టిన సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు విడుదల అవుతున్నప్పుడు.. నిర్మాతలు తమ సినిమా టికెట్ రేట్లను పెంచమని ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటారు. అలా తమ టికెట్ రేట్లు పెంచాలి అనుకునేవాళ్లు ముందుగా డ్రగ్స్ నియంత్రణ, ఇలాంటి సోషల్ అవేర్నెస్ పెంచే వీడియో చేసి.. విడుదల చేయాలని కండిషన్ పెట్టారు. 

తాజాగా భారతీయుడు 2 ఈవెంట్లో సిద్ధార్థ ఈ షరతుకి.. సంబంధించిన ఒక ప్రశ్న ఎదురయింది.  ‘సామాజిక స్పృహ.. కలిగించే వీడియో చేస్తేనే టికెట్ రేట్లు పెంచుతామని.. రేవంత్ రెడ్డి కండిషన్ పెట్టారు. ఈ కండిషన్ పక్కన పెడితే నటుడిగా సోషల్ అవేర్నెస్ కలిగించే.. వీడియోలు చేయాలని సామాజిక బాధ్యత మీకు ఉందా?’ అని ఒక ఇంటర్వ్యూర్ అడిగారు. 

ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.."నేను ఒక 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. 2005 నుంచి 2011 వరకు నేను కండోమ్స్ ను ప్రమోట్ చేశాను. అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. ఒకటే రాష్ట్రం కదా. నా అంతట నేనే సామాజిక బాధ్యత తీసుకొని.. ఆ యాడ్ చేశాను. కానీ నాకు ఎవరో సీఎం చెప్పారని.. నేను చేయలేదు. ఇప్పుడైనా ఏదైనా సీఎం అలా చేయాలి అంటే.. చేస్తాను తప్ప.. ఇప్పటిదాకా ఇలా చేస్తేనే అలా చేస్తామని ఏ ముఖ్యమంత్రి మాతో చెప్పలేదు" అని అన్నారు సిద్ధార్థ్.  

సిద్ధార్థ్ మాటల్లో నిజం ఉంది. నటులందరికీ సామాజిక బాధ్యత.. ఉంటుంది. ఇదివరకే ఎంతోమంది హీరోలు.. తమంతట తాముగా వచ్చి మరి.. సామాజిక స్పృహాలు కలిగించే వీడియోలు చేశారు. ముఖ్యమంత్రిలు కండిషన్స్ పెట్టకపోయినా.. ప్రజలకు పనికొచ్చే వీడియోలు ఇప్పటికే మన సౌత్ ఇండియా హీరోలు కొంతమంది తమ సొంత ఇంట్రెస్ట్ తో చేసి పెట్టారు. కాబట్టి సిద్ధార్థనీ తప్పు పట్టడానికి లేదు. అలా అని రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కూడా తప్పు అని చెప్పలేము. 

సెలబ్రిటీలు కాబట్టి ఎక్కువ మంది ప్రేక్షకులు వాళ్లను చూస్తారు. వాళ్ళు చెప్పింది ఫాలో అవుతారు. కాబట్టి వాళ్లతో సామాజిక స్పృహ కలిగించే వీడియోలు చేయడం సమాజానికి ఉపయోగపడుతుంది.. తప్ప చెడు తీసుకురాదు అని రేవంత్ రెడ్డి అభిప్రాయం. కాబట్టి ఈ విషయంలో సిద్ధార్థ కౌంటర్ ఎలా ఉన్నా ఇద్దరిదీ తప్పు అని చెప్పడానికి లేదు.

 

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News