Bandi Trailer: వైవిద్యమైన కథతో రాబోతున్న ఆదిత్య ఓం.. సింగిల్ కారెక్టర్‌తో సాగే ‘బంధీ’ ట్రైలర్ రిలీజ్

Bandi: లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో ఆదిత్య ఓం. ఆ తరువాత కూడా కొన్ని కామెడీ చిత్రాలలో నటించి మెప్పించిన ఈ హీరో ఈమధ్య సినిమాలకు దూరమయ్యారు. కాగా ఇప్పుడు మళ్లీ ఒక వైవిధ్యమైన కథతో మన ముందుకు రానున్నారు   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2023, 05:24 PM IST
Bandi Trailer: వైవిద్యమైన కథతో రాబోతున్న ఆదిత్య ఓం.. సింగిల్ కారెక్టర్‌తో సాగే ‘బంధీ’ ట్రైలర్ రిలీజ్

Aditya Om: ధనలక్ష్మి ఐ లవ్ యు.. లాహిరి లాహిరి లాహిరిలో.. లాంటి సినిమాలలో నటించి మెప్పించిన హీరో ఆదిత్య ఓం. కాగా కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరో ఇప్పుడు ఒక వైవిధ్యమైన కథతో మన ముందుకి రానన్నారు.

సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు. కాగా ఇలాంటి  ప్రయోగమే ఇప్పుడు చేయబోతున్నారు హీరో ఆదిత్య ఓం. మొదటినుంచి డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ హీరో ఈ సారి ‘బంధీ’ అంటూ అందరినీ ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. 

తిరుమల రఘు దర్శకత్వం లో వస్తున్న సినిమాని గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఈ సినిమాలోని ఈరోజు విడుదల చేశారు. ఇక ఈ సినిమా కథ కాన్సెప్ట్ ని ఈ ట్రైలర్‌లో తెలియజేశారు. ఓ సగటు మనిషి కోరుకునేవి ఎలా ఉంటాయో చూపించాడు. ఏ మనిషైనా ఆహారం, నీరు, డబ్బు, స్వాతంత్ర్యం కోరుకుంటారు. స్వేచ్చగా విహరించాలని అనుకుంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఏర్పడిన ఘట్టాలనే ఈ సినిమాగా దర్శకుడు మలచారు అనే విషయం అర్థం అవుతోంది. ఇక ఈ ట్రైలర్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌ను ఆదిత్య ఓం చూపించారు. ఇక ఈ ట్రైలర్ లో చివరగా హీరో నగ్నంగా కనిపించే షాట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరచడం ఖాయం.

ఈ చిత్రానికి మధుసూధన్ కోట సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించగా..వీరల్, లవన్, సుదేష్ సావంత్ సంగీతాన్ని అందించారు. దేశంలోని పలు అటవీ ప్రాంతాల్లో ఈ మూవీని షూట్ చేశారు. ఇక ఈ చిత్రంలో ఆదిత్య ఓం ఎలాంటి డూప్ లేకుండా అన్ని రకాల స్టంట్స్ చేశారు. దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి సంవత్సరం మొత్తం ఉండే అన్ని రుతువుల్ని కవర్ చేస్తూ ఈ మూవీని షూట్ చేశారు. పర్యావరణ సంరక్షణ మీద తీసిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు

Also read: Vitamin D: విటమిన్ డి ఎక్కువైతే ఏమౌతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలెదురౌతాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News