Thegimpu Movie Review : అజిత్ 'తెగింపు' రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?

Thegimpu Movie Review అజిత్ హీరోగా వచ్చిన తెగింపు సినిమా ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2023, 11:47 AM IST
  • నేడే థియేటర్లోకి అజిత్ తెగింపు
  • మాస్ ఆడియెన్స్‌ మెచ్చేలా
  • తెగింపు సినిమాకు టికెట్లు తెగుతాయా?
Thegimpu Movie Review : అజిత్ 'తెగింపు' రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?

Thegimpu Movie Review అజిత్ హెచ్ వినోద్ కాంబోలో ఇది వరకు నేర్కోండ పార్వై, వలిమై సినిమాలు వచ్చాయి. ఈ రెండూ కూడా పర్వాలేదనిపించాయి. వలిమై సినిమాలో యాక్షన్స్ అదిరిపోయాయి. ఇప్పుడు తెగింపు అంటూ మరోసారి అజిత్, హెచ్ వినోద్‌లు వచ్చారు. మరి ఈ తెగింపు ట్రైలర్ చూస్తే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరినట్టు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. తెగింపు కథ, కథనాలు ఏంటన్నది ఓ సారి చూద్దాం.

కథ
తెగింపు సినిమాలో అజిత్‌కు ఒక పేరంటూ ఉండదు. డార్క్ డెవిల్, చీఫ్‌, మైఖేల్ జాక్సన్ ఇలా రకరకాల పేర్లతో కథ ముందుకు సాగుతుంటుంది. అజిత్, కణ్మణి (మంజు వారియర్‌) మరికొంతమంది కలిసి ఓ గ్యాంగ్‌లా ఏర్పడతారు. వార వద్ద అధునాతమైన టెక్నాలజీతో కూడుకున్న వెపన్స్ ఉంటాయి. వారంతా కలిసి ఓ బ్యాంక్‌ను దోపీడీ చేయాల్సి వస్తుంది. క్రిష్ (జాన్ కొక్కెన్‌) అధినేతగా ఉన్న యువర్ బ్యాంక్‌ను ఎందుకు దోపీడి చేయాల్సి వస్తుంది. ఆ సుపారీ ఇచ్చింది ఎవరు? అసలు ఈ బ్యాంక్‌ను టార్గెట్ చేయడం వెనుకున్న కథ ఏంటి? అజిత్ పాత్ర ఇచ్చే ట్విస్టులు ఏంటి? చివరకు ఎండ్ కార్డ్ ఎలా పడింది? బ్యాంక్ ఫ్రాడ్‌ల మీద తెగింపు ఇచ్చిన సందేశం ఏంటి? అనేది కథ.

విశ్లేషణ:

బ్యాంకు దొంగతనం నేపథ్యంలో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అదే కోవలో ఈ తెగింపు సినిమా కూడా సాగుతుంది. ఒక పోలీసు అధికారి తన స్నేహితుడు సూచనలతో బ్యాంకు దోపిడీ చేసేందుకు ఒక గ్యాంగ్ తో సుఫారీ మాట్లాడుకుంటాడు. డార్క్ డెవిల్ అనే పేరు గల ఒక గ్యాంగ్స్టర్ అనూహ్యంగా ఈ బ్యాంకు రాబరీ సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. అతను ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో అనేక మలుపులు చోటు చేసుకుంటూ సాగుతుంది. సాధారణంగా బ్యాంకు దోపిడీ అంటే ఒకే ప్రదేశంలోనే చిత్రీకరించాల్సి ఉంటుంది ప్రేక్షకులు కాస్త బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కానీ దర్శకుడు వినోద్ ఈ బ్యాంకు రాబరీ నేపథ్యం ఉన్న సినిమాని ఆసక్తికరంగా మలచడంలో సఫలమయ్యాడు. బ్యాంకు దోపిడీదారులుగా లోపలికి ఎంట్రీ ఇచ్చిన వారిని ప్రజలందరూ హీరోలుగా చూసేలా చేయడంలో కూడా దర్శకుడు తనదైన మ్యాజిక్ చూపించాడు. బ్యాంకు మోసాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినట్లుగా సినిమా సాగింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు ప్రాణాలు తీసుకోకండి ఆ తెగింపు ఏదో ఆ ఫ్రాడ్స్ కి కారణమైన వారిని నిలదీయడానికి వాడండి అని చెప్పేదే తెగింపు.  అజిత్ అంటేనే ఒక స్టైలిష్ హీరో అనే పేరు ఉంది దాన్ని మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ చేసినట్లయింది.

నటీనటులు
నటీనటుల విషయానికి వస్తే అజిత్ తనకు ఎప్పటిలానే అలవాటైన యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంతో స్టైలీష్‌గా చేసేశాడు. అజిత్ లుక్స్, యాక్షన్ సీక్వెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక మంజు వారియర్‌కు మరో అద్భతమైన పాత్ర పడినట్టు కనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో మంజు వారియర్ అదరగొట్టేసింది. అజిత్ వన్ మ్యాన్ షో గా సినిమా మొత్తాన్ని నా భుజస్కందాల మీద నడిపించాడు. ఇక ఆయన తర్వాత యాక్షన్ సన్నివేశాలలో ఎక్కువగా కనిపించే అవకాశం హీరోయిన్గా కనిపించిన మంజు వారియర్ కు దక్కింది. ఆమె కాకుండా అజయ్, జాన్ కొక్కెన్, సముద్రఖని వంటి వారు తమ తమ పాత్రలలో ఆకట్టుకున్నారు. మిగతా వాళ్లలో కొంతమంది సినిమాని కామెడీ వేలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నించి దాదాపుగా సఫలమయ్యారు. తమిళ సినిమా అయినా అజయ్, జాన్ కొక్కెన్, సముద్రఖని వంటి వారు ఉండడంతో తెలుగు వారికి కూడా దగ్గరయ్యే విధంగా సినిమా ప్రెజెన్స్ ఉంది. 

ఫైనల్ గా చెప్పాలంటే
తెగింపు, అజిత్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్.. కొంత లాగ్ అనిపించినా మంచి థ్రిల్ తో బయటకొస్తారు. 

రేటింగ్: 3/5

 

Trending News