Akhil Akkineni: సలార్ కి అఖిల్ కి ఉన్న సంబంధం ఇదే …ఫైనల్ గా బయటకి వచ్చిన నిజం!

Akhil 6: టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్న ఫలితం దక్కని హీరో అక్కినేని అఖిల్. లాస్ట్ ఇయర్ ఏజెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి కనివిని ఎరుగని డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హీరో. అప్పటినుంచి అతని నెక్స్ట్ మూవీ పై ఎటువంటి అప్డేట్స్ లేవు. ఇంతకీ దీని వెనుక కారణం ఏమిటో తెలుసా?

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2024, 12:20 PM IST
Akhil Akkineni: సలార్ కి అఖిల్ కి ఉన్న సంబంధం ఇదే …ఫైనల్ గా బయటకి వచ్చిన నిజం!

Akhil with Salaar Makers: అక్కినేని ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ జనరేషన్ హీరోలు నాగచైతన్య,‌ అఖిల్. ఇద్దరిలో నాగచైతన్య ఒక మోస్తారు సక్సెస్ తో ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే అఖిల్ మాత్రం కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు చేస్తే.. అందులో ఒకటి పర్వాలేదు అనిపించుకుంటే మిగిలిన నాలుగు డిజాస్టర్స్ కావడం విశేషం. లాస్ట్ ఇయర్ వచ్చిన అఖిల్ ఏజెంట్ చిత్రం ఎప్పుడు వచ్చింది.. ఎప్పుడు వెళ్ళింది కూడా ఎవరికి తెలియదు.

అఖిల్ ఏజెంట్ చిత్రం వచ్చి ఇప్పటికి 8 నెలలు అవుతున్నా.. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి అప్డేట్ లేదు. అసలు అఖిల్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాడా లేదా అనే డౌట్ కూడా అక్కడక్కడ వినిపిస్తోంది. అప్పుడప్పుడు బయట కనిపిస్తున్న.. మీడియాతో అఖిల్ ముచ్చటించిన దాఖలు కూడా లేదు. 

కాగా రీసెంట్ గా జరిగిన సలార్ మూవీ సక్సెస్ పార్టీలో అఖిల్ చేతికి పెద్ద కట్టుతో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలో సలార్ పార్ట్ 2 లో అఖిల్ భాగమై ఉంటాడని.. అందుకే పార్టీకి వచ్చాడని అందరూ అనుకున్నారు. అయితే ఆ తరువాత ధీర సినిమా కోసం తన ఫిజిక్ ను బిల్డ్ చేసుకునే క్రమంలో అఖిల్ కి ఆ దెబ్బ తగిలింది అన్న రూమర్ కూడా స్ప్రెడ్ అయింది.

యు వి క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ కుమార్ డైరెక్షన్ లో అఖిల్ అక్కినేని నటిస్తున్న మూవీకి ధీరా అనే టైటిల్ ని అనుకున్నారు. ఆ తర్వాత ఈ మూవీ నుంచి ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్ ఒక్కటి కూడా రాలేదు. ఎదురు చూస్తున్న కొద్ది ఈ మూవీ లేట్ అవుతూనే ఉంది. ఇంతకీ ఈ ఆలస్యానికి వెనక కారణం ఏమిటి అంటే.. అఖిల్ కి మార్కెట్ లేకపోయినప్పటికీ.. స్టోరీ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో.. ఓవరాల్ గా ఈ చిత్రానికి 100 కోట్ల వరకు బడ్జెట్ పెట్టడానికి ఫిక్స్ అయ్యారట. అయితే బడ్జెట్ ఇంతకంటే మించిపోయేలా ఉండడంతో ఇందులో పార్ట్నర్ గా హోంబాలే ఫిలిమ్స్ ను జాయిన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

వీళ్ళిద్దరి పార్టనర్ షిప్ కు సంబంధించిన ఒప్పందం ఆల్మోస్ట్ కుదిరినట్టేనని.. అందుకే అఖిల్ ప్రభాస్ ఈవెంట్ కి హాజరయ్యారని టాక్. ధీర మూవీ విషయానికి వస్తే..
గేమ్స్ అఫ్ థ్రోన్స్.. తరహాలో అన్ని మిక్స్ చేసిన ఒక ఫాంటసీ మూవీ లాగా ఉంటుందట. ఇందులో విజువల్ ట్రీట్ ఎక్కువ ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ మూవీలో కొన్ని ఇంపార్టెంట్ పాత్రల కోసం స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలను తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారట. సో ఈ కారణం వల్ల అఖిల్ 6 కాస్త లేట్ అవుతా వస్తుందట. మొత్తానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరికి లేక 2025 సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

Also read: Indian Railway New Rules: రైళ్లో లోయర్ బెర్త్ కొత్త రూల్స్, ఇక ఆ సీటు వారిదే

Also read ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News