Allu Sirish Buddy Trailer: గత కొంతకాలంగా.. సినిమాలకి దూరంగా ఉంటున్న అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ ఎట్టకేలకు.. ఒక సినిమాతో త్వరగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సామ్ అంటోన్ దర్శకత్వం వహిస్తున్న.. బడ్డీ అనే సినిమాతో అల్లు శిరీష్ మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తున్నారు.
నిజానికి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్.. చాలా కాలం క్రితం వచ్చింది. ఇన్నాళ్ళకి ఈ సినిమా ట్రైలర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ట్రైలర్ మొదలవడమే సినిమాలో.. కీలక పాత్ర పోషిస్తున్న ఒక టెడ్డీబేర్ ని ఇంట్రడ్యూస్.. చేస్తూ మొదలవుతుంది.
"అన్యాయాన్ని ఎదిరించే సింహాన్ని.. చిరుతని.. పులిని చూసి ఉంటారు. కానీ టెడ్డీ బేర్ ని చూశారా" అంటూ సాయికుమార్ తన బేస్ వాయిస్ తో టెడ్డీ బేర్ ని.. హైప్ ఇస్తూ పరిచయం చేయడం కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో అల్లు శిరీష్ పైలట్ గా కనిపించనున్నారు.
బడ్డీ అనే టెడ్డీ బేర్ సహాయం కోసం ఆదిత్య రామ్ (అల్లు శిరీష్) ని అడుగుతాడు. అయితే అసలు ఈ బడ్డీ ఎవరు, ఆదిత్య రామ్ తో బడ్డీకి ఏం పని, బడ్డీ అడిగిన సహాయం ఆదిత్య రామ్ చేస్తాడా? బడ్డీ అడిగిన సహాయం ఏంటి? చివరికి ఏమైంది? అనేది సినిమా కథ అని ట్రైలర్ చూస్తేనే అర్థమయిపోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter