Amitabh Hospitalised: కౌన్ బనేగా కరోడ్పతి షూట్లో ప్రమాదం.. తీవ్ర రక్తస్రావంతో హుటాహుటిన హాస్పిటల్ కు?

Amitabh Bachchan Hospitalised: కేబీసీ ఎపిసోడ్ షూటింగ్‌లో ఉండగా​ ప్రమాదం జరగడంతో అమితాబ్ బచ్చన్‌ ఆదివారం నాడు ఆసుపత్రి పాలయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 23, 2022, 06:40 PM IST
Amitabh Hospitalised: కౌన్ బనేగా కరోడ్పతి షూట్లో ప్రమాదం.. తీవ్ర రక్తస్రావంతో హుటాహుటిన హాస్పిటల్ కు?

Amitabh Bachchan Hospitalised: బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్‌ ఆదివారం నాడు ఆసుపత్రి పాలయ్యారు. అమితాబ్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు.  ఆ సమయంలో అమితాబ్ బచ్చన్‌ కాలు తెగిపోయింది, దీంతో అమితాబ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీకువచ్చిన వెంటనే అమితాబ్ బచ్చన్‌ కాలు నుండి రక్తాన్ని ఆపడానికి కుట్లు వేశారు. ఆదివారం నాడు కేబీసీ ఎపిసోడ్ షూటింగ్‌లో ఉండగా, ఆయనకు ప్రమాదం జరిగింది.

అమితాబ్ కాలి వెనుక భాగంలోని ఉన్న ఒక నరం తెగిపోయింది, ఈ క్రమంలో రక్తస్రావం ఎక్కువైంది. ఈ క్రమంలోనే ఆయన కాలికి కుట్లు వేయవలసి వచ్చింది. ప్రస్తుతానికి అమితాబ్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అమితాబ్ తన కాళ్లపై తాను కొన్నాళ్ల పాటు కూడా వద్దని పూర్తిగా బెడ్ కే పరిమితం అవ్వాలని వైద్యులు సూచించాలి. ఇక ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ తన అధికారిక బ్లాగ్‌లో కూడా పంచుకున్నారు.

ఒక మెటల్ ముక్క తన ఎడమ కాలిలో నరం తెంచిందని, అలా జరిగినప్పుడు రక్తం బయటకు ప్రవహిస్తూనే ఉందని పేర్కొన్నారు. వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్లడంతో డాక్టర్ అలాగే సిబ్బంది బృందం సకాలంలో సహకారం అందించడంతో తనకు శస్త్రచికిత్స జరిగిందని పేర్కొన్నారు. ఇక తన విల్ పవర్ చాలా బలంగా ఉంది, త్వరలోనే తిరిగి వస్తానని అమితాబ్ పేర్కొన్నారు.

అమితాబ్ బచ్చన్ తనను బయటికి వెళ్లకూడదని వైద్యులు సూచించారని అన్నారు. అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో కేబీసీ సెట్స్‌లో గడిపే సమయంలో, చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని అన్నారు. ఇక ఇటీవల అమితాబ్ బచ్చన్ ఇటీవల తన 80వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేబీసీ బృందం ప్రత్యేక ఎపిసోడ్‌ను సూట్ చేసింది, ఆ ఎపిసోడ్లో అభిషేక్ బచ్చన్, జయా బచ్చన్ కూడా పాల్గొన్నారు.

Also Read: RRR Naatu Naatu Step: నాటు నాటు సాంగ్ కు కాలు కదిపిన జపనీస్ యూట్యూబర్..ఏమి గ్రేస్ అయ్యా?

Also Read: Rishabh Shetty Ram Charan: అల్లు అరవింద్ మాస్టర్ స్కెచ్.. మెగా హీరోతో రిషబ్ పాన్ ఇండియా మూవీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News