Bollywood Corporate Bookings Scam: తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డివంగా హిందీ హీరో రణబీర్ కపూర్ తో తీసిన సినిమా యానిమల్. ప్రశంసలతో పాటు ఎన్నో విమర్శలు తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం సునామీ సృష్టించింది. కాగా ఈ యానిమల్ సినిమా నిర్మాతల్లో ఒకరైన ప్రణయ్ వంగా బాలీవుడ్ కలెక్షన్స్ పై సంచలన ఆరోపణలు చేశాడు. కాగా ప్రణయ్ వంగా మరెవరో కాదు.. యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ అన్నయ్య. ప్రణయ్ వంగ తమ నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ ని చూసుకుంటున్నారు. బాలీవుడ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టాడు.
యానిమల్ సినిమా భారీ విజయం సాధించి దాదాపు 800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ చిత్ర సక్సెస్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రణయ్ వంగా మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ లో కార్పొరేట్ టికెట్ బుకింగ్స్ సిస్టమ్ ఉంది. అది మేము యానిమల్ సినిమాకి ఫాలో అవ్వలేదు. అందుకే మా సినిమాకు 1000 కోట్ల కలెక్షన్స్ రాలేదు. అలా కాకుండా మేము కూడా కొంతమంది బాలీవుడ్ వాళ్ళ లాగా కార్పొరేట్ బుకింగ్స్ చేసుంటే యానిమల్ సినిమాకి తప్పకుండా 1000 కోట్ల కలెక్షన్స్ అని చెప్పుకునే వాళ్ళం’ అని చెప్పుకొచ్చారు. దీంతో ప్రణయ్ బాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కార్పొరేట్ బుకింగ్స్ అనగా.. స్టార్ హీరోల సినిమాలకు అనుకున్నంత హైప్ లేదా కలెక్షన్లు రాకపోతే .. ఆ చిత్రం హీరో లేదా నిర్మాణ సంస్థ కొన్ని కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసి మరి ఎక్కువ టికెట్స్ అమ్ముడవుతున్నట్టు చూపిస్తారు. అంతేకాకుండా ఈ ఫ్రీ టికెట్ తో సినిమా చూసిన వాళ్లంతా తమ సోషల్ మీడియాలో సినిమా గురించి ప్రమోట్ చేస్తారు.
ఇలా వారి సినిమాకి వారే హైట్ ఇచ్చుకొని..
ఫేక్ కలెక్షన్స్ సృష్టించడాన్ని కార్పొరేట్ బుకింగ్స్ అంటారు. కరెక్ట్ గా చెప్పాలి అంటే దీన్నే కార్పొరేట్ బుకింగ్స్ స్కామ్ అంటారు.
కాగా ఈ విధానంతోనే సినిమాని 1000 కోట్ల వరకు తీసుకెళ్తారని, మేము అలా చేయలేదు కాబట్టి మాకు 1000 కోట్లు రాలేదని యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అన్నయ్య ప్రణయ్ వంగా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి.
ఇక ఈ మధ్య ఇదే షారుక్ డంకీ కి కూడా జరిగింది అని వార్తలు వచ్చాయి. సలార్ చిత్రానికి చాలా దగ్గర డంకీ నిర్మాతలు థియేటర్లు కూడా ఇవ్వలేదు. ఈ సినిమాకి కార్పొరేట్ బుకింగ్ చేశారు అనే వార్త పలు సార్లు వినిపించింది. ఇక సలార్ సినిమా విషయంలో షారుఖ్, అతని నిర్మాతలు చేసిన పనితో గతంలో షారుక్ ఖాన్ సూపర్ హిట్ సినిమాలు జవాన్, పఠాన్ సినిమాలకు వచ్చిన కలక్షన్స్ నిజమేనా లేదా అవి కూడా కార్పొరెట్ బుకింగ్ స్కామ్ తో తెప్పించారా అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు
Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook