RRR Movie Total Collections: అక్కడ 100 కోట్ల క్లబ్‌కి చేరువలో ఆర్ఆర్ఆర్ మూవీ

RRR Movie Total Collections: ఆర్ఆర్ఆర్ మూవీ.. రాజమౌళి దర్శకత్వంలో.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకుపైగా గ్రాస్‌ వసూళ్లు అందుకుంది. అమెరికాలోనూ సూపర్ కలెక్షన్స్ సాధిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 11:28 PM IST
  • కలెక్షన్స్‌లో జోరు తగ్గని ఆర్ఆర్ఆర్ మూవీ
  • హిందీలో రూ. 200 కోట్ల నెట్‌ వసూలు చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ
  • అమెరికాలోనూ సత్తా చాటుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ
RRR Movie Total Collections: అక్కడ 100 కోట్ల క్లబ్‌కి చేరువలో ఆర్ఆర్ఆర్ మూవీ

RRR Movie Total Collections: ఆర్ఆర్ఆర్ మూవీ.. రాజమౌళి దర్శకత్వంలో.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకుపైగా గ్రాస్‌ వసూళ్లు అందుకుంది. అమెరికాలోనూ సూపర్ కలెక్షన్స్ సాధిస్తోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటివరకు 13 మిలియన్ డాలర్లు వసూలు చేసి మరో రికార్డ్ క్రియేట్ చేసింది. రూపాయల్లో ఇది 98 కోట్ల గ్రాస్. 

హిందీలోనూ ఆర్ఆర్ఆర్ మంచి వసూళ్లు రాబడుతోంది. 200 కోట్ల నెట్‌ వసూలు చేసింది. మొదటి వారంలో రికార్డు కలెక్షన్స్ సాధించి.. రెండో వారంలోనూ దూసుకెళ్తోంది. ఈ సినిమా తొమ్మిదో రోజు టాలీవుడ్ చరిత్రలోనే ఊహకందని విధంగా.. ఏకంగా 19.62 కోట్ల షేర్ సొంతం చేసుకుని ప్రభంజనం స‌‌ృష్టించింది. తొమ్మిదో రోజు వరల్డ్ వైడ్‌ ఏకంగా 37.12 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. 13వ రోజు రెండు రాష్ట్రాల్లో 2.54 కోట్ల షేర్‌ రాబట్టింది. వరల్డ్ వైడ్‌ 7.45 కోట్ల వరకు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ 13 రోజుల కలెక్షన్స్

నైజాం : 102.60 Cr

సీడెడ్: 46.92 Cr

UA: 31.93 Cr

తూర్పు గోదావరి : 14.54 Cr

పశ్చిమ గోదావరి : 12.12 Cr

గుంటూరు : 16.88 Cr

కృష్ణా : 13.50 Cr

నెల్లూరు : 8.41 Cr

ఏపీ, తెలంగాణ మొత్తం:- 246.90 Cr (371.00 Cr గ్రాస్)

కర్ణాటక : 39.30 Cr

తమిళనాడు : 35.05 Cr

కేరళ : 9.85 Cr

హిందీ : 99.50 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా : 7.85 Cr

OS – 90.05Cr

టోటల్ వరల్డ్ వైడ్ : 528.50 Cr (గ్రాస్- 951.50 Cr)

ఆర్ఆర్ఆర్ సినిమాను (RRR Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి 75.50 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ కాలేదు. ఆర్ ఆర్ ఆర్ నటులు విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ డీఓపీగా వ్యవహరించారు.

Also read : RRR: 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఆకాశానికెత్తేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Also read : RRR Collections: బాక్సాఫీస్ షేక్ అయ్యే కలెక్షన్స్... దిల్ రాజు పంట పండిందిగా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News