Bigg Boss 7 Telugu: అమర్ కు ఊహించని షాక్... తొలి ఫైనలిస్ట్ గా అర్జున్..

Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్‏బాస్ ఊహించని ట్విస్టులతో దూసుకుపోతుంది. నిన్నటి వరకు ఫినాలే అస్త్ర గెలుస్తాడా అనుకున్న అమర్ కు షాకిచ్చాడు అంబటి అర్జున్.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2023, 11:48 AM IST
Bigg Boss 7 Telugu: అమర్ కు ఊహించని షాక్... తొలి ఫైనలిస్ట్ గా అర్జున్..

Bigg Boss 7 Telugu finale astra winner: తెలుగు బిగ్‏బాస్ హౌస్‏లో ఫినాలే అస్త్ర ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠకు తెరపెడింది. నాలుగు రోజులగా కంటెస్టెంట్ల మధ్య దోబుచూలాడిన ఫినాలే అస్త్ర చివరికి అంబటి అర్జున్ అంబటికు దక్కింది. అమర్, ప్రశాంత్ కు షాకిస్తూ.. అర్జున్ తొలి ఫైనలిస్ట్ గా నిలిచాడు. అయితే మెుదటి నుంచి ఎవరి పాయింట్స్ తీసుకోకుండా గెలిచిన కంటెస్టెంట్ గా అర్జున్ నిలిచాడు. గెలవడానికి అమర్ శతవిధాల ప్రయత్నించినప్పటికీ... చివరికి ఫినాలే అస్త్ర అర్జున్ నే వరించింది. మరోవైపు ప్రశాంత్ ఓడినప్పటికీ అందరి మనసులను గెలుచుకున్నాడు. అతడు టాస్కులు ఆడిన విధానం అందరినీ మెప్పించింది. 

ఫినాలే ఆస్త్రను అమరే గెలుస్తాడని ఆడియెన్స్ తోపాటు హౌస్ మేట్స్ కుడా అనుకుంటూ వచ్చారు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ రేసు నుంచి తప్పుకుని.. తన పాయింట్స్ ను ప్రియాంక చెప్పిందని అమర్ కు ట్రాన్స్ ఫర్ చేశాడు. దీంతో అమర్ విజయం ఖాయమనుకున్నారు అందరూ. కానీ ఎవరూ ఊహించిన విధంగా అర్జున్ టాప్ లోకి దూసుకొచ్చాడు. వరుసగా మూడు టాస్కులు గెలిచి ఫినాలే ఆస్త్రను ఎగరేసుకుపోయాడు. 

Also Read: Bigg Boss 7 Telugu Voting: సడెన్‌గా మారిపోయిన ఓటింగ్ లెక్కలు.. డేంజర్‌ జోన్‌లో ఆ బ్యూటీ...

మరోవైపు ఓటింగ్ విషయానికొస్తే.. ఎప్పటిలాగే రైతు బిడ్డ ప్రశాంత్ తొలి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో హీరో శివాజీ, మూడో స్థానంలో యావర్ కొనసాగుతున్నారు. మెున్నటి వరకు చివరి స్థానాల్లో ఉన్న గౌతమ్, అర్జున్ నాలుగు, ఐదు స్థానాలకు ఎగబాకారు. దీంతో ఆరు, ఏడు స్థానాల్లో ప్రియాంక, శోభా నిలిచారు. ఈ వారం శోభా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బిగ్ బాస్ శోభాను హౌస్ నుంచి బయటకు పంపిస్తాడా లేదా ఎప్పటిలాగే కాపాడతాడా అనేది వేచి చూడాలి. 

Also Read: Salaar Trailer: ప్రభాస్ సలార్ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News