Salaar Trailer: ప్రభాస్ సలార్ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం

Prabhas Salaar Official Telugu Trailer: సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ట్రైలర్ ఈరోజు విడుదలై యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘ఐ కైండ్లీ రిక్వెస్ట్’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ తో ఆయన అభిమానులు సందడి చేసుకుంటున్నారు.. ఇక ఈ ట్రైలర్ విశేషాలు మీకోసం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2023, 08:52 PM IST
Salaar Trailer: ప్రభాస్ సలార్ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం

Salaar Trailer Review: సినీ ప్రేక్షకులు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న ప్రభాస్ సలార్ ట్రైలర్ వచ్చేసింది. కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నారు అనగానే ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు విడుదలైన సినిమా ట్రైలర్ ఈ చిత్రంపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది.

ప్రశాంతి నీల్ ఈ మధ్య తన ఇంటర్వ్యూలో చెప్పినట్టే ఈ ట్రైలర్ చూస్తే కూడా ఇది ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగే సినిమా అని అర్థమయిపోతోంది. అంతేకాదు కేజీఎఫ్ సిరీస్‌లో అమ్మ సెంటిమెంట్‌తో గుండెల్ని హత్తుకున్న ప్రశాంత్ నీల్ ఈసారి సలార్‌సో ఫ్రెండ్‌షిప్‌ను తీసుకువచ్చాడు. ఇక సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్ ట్రైలర్  మొదట్లోనే ఇద్దరు చిన్నారుల మధ్య స్నేహాన్ని చూపిస్తూ ట్రైలర్ ని స్టార్ట్ చేశాడు ప్రశాంత్. రేయ్ నీకోసం ఎర అయినా అవుతా సొర అయినా అవుతా.. నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా.. అంటూ చిన్నప్పడు వరదరాజ్ (పృథ్వీరాజ్‌)కి మాటిచ్చి దూరంగా వెళ్లిపోతాడు దేవ (ప్రభాస్). 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News