ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్ సమర్పణలో బాబా పి.ఆర్ దర్శకత్వం వహిస్తున్న'అష్టదిగ్బంధనం' సినిమాను మనోజ్‌కుమార్ అగర్వాల్ నిర్మించారు. సూర్య, విషిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ‘బేబి’ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన దర్శకుడు "సాయి రాజేష్" ముఖ్య అతిథిగా విచ్చేసి.. ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇటీవలే ఈ సినిమాలోని ఐయామ్ విత్ యూ' పాటను 'ఉప్పెన' దర్శకుడు బుచ్చి బాబు సానా ' లాంచ్ చేశారు. ఓయీ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సందర్భంగా ‘అష్టదిగ్బంధనం’ దర్శక, నిర్మాతలు మీడియాతో ముచ్చటించిన విశేషాలు..
దర్శకుడు బాబా పి.ఆర్. మాట్లాడుతూ..
అష్టదిగ్బంధనం చాలా పవర్‌ఫుల్ టైటిల్..దీనికి ఎలా న్యాయం చేశారు..?
అవును.. అష్టదిగ్బంధనం అనేది చాలా పవర్ ఫుల్ టైటిల్.. ఈ టైటిల్ కు న్యాయం చేకూర్చేలా ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని తెరకెక్కించాం.. సినిమా టైటిల్ లో ఉన్నట్టుగానే ప్రతి ఒక్కరు ఎదుటివారిని అష్టదిగ్బంధనం చేయాలని చూస్తుంటారు. ఇలా పలువురి స్వార్ధంతో కూడిన జీవితాలకు సంబంధించిన కథే ఇది
ట్రైలర్ లో వయోలెన్స్ ఎక్కువగా ఉన్నట్టుంది..?
నిజానికి ఇదొక యాక్షన్, థ్రిలర్.. థిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ఇక ఇతర వర్గాల ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించాం. ఫస్ట్ ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వలన మీకు అలా అనిపించింది. కానీ రెండో ట్రైలర్ చూసాక మీ అభిప్రాయం మారుతుంది.
కొత్త నటులతో రిస్క్ అనిపించలేదా.. ?
కథలో విషయం ఉంటే.. నటీనటీమణులు వారంతట వారే నటించేస్తారు. ఈ సినిమాలో నటులు కొత్తవారైనా.. అందరూ అనుభవం ఉన్న నటులకుగా కనిపిస్తారు.
మ్యూజిక్ డైరెక్టర్ గా జాక్సన్ విజయన్‌ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు.. ?
జాక్సన్ విజయన్ మలయాళ చిత్రాల్లో ఎంత మంచి టెక్నీషియన్. ముఖ్యంగా తన తాజా చిత్రం ‘ట్రాన్స్’ ఎంతటి విజయం సాథించిందో మన అందరికీ తెలుసు. 'అష్టదిగ్బంధనం' కథకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. అందుకే ఆయన్ను ఎంచుకున్నాం.. వెరీ నైస్ పర్సన్.. ఉన్న 3 పాటలుకు మంచి సంగీతాన్ని అందించారు.
నిర్మాత గురించి మీ మాటల్లో..?
ఈ సినిమా నిర్మాత మనోజ్‌కుమార్ అగర్వాల్.. ఒక బిజినెస్ మ్యాన్. సినిమాల మీద కూడా ఆసక్తి ఎక్కువ. ఈ కథ చెప్పగానే బాగా ఆసక్తి కనబరిచారు. కథకోసం ఏం అడిగిన కాదనకుండా అరేంజ్ చేశారు. ఫైనల్ అవుట్‌పుట్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
ఫైనల్‌గా ప్రేక్షకులకు ఏం చెప్పదల్చుకున్నారు..?
ప్రేక్షకులకు చెప్పేది ఒక్కటే.. ఈ నెల 22న మీరు థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి. మీరు కొన్న టిక్కెట్ రేట్‌కు మరిన్నిరెట్లు సంతృప్తినిస్తుంది.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
నిర్మాత మనోజ్‌కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ...
నిర్మాతగా తొలి ప్రాజెక్ట్‌కే ఇంత రిస్క్ సబ్జెక్ట్ ఎంచుకోవడం వెనుక..?
ఇది స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా. ఈ కథను వినగానే చాలా ఎగ్జైట్ ఫీలయ్యా. ఇలాంటి కథతో నిర్మాతగా మారుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక రిస్క్ అంటారా.. కథలో ఉన్న బలం ఆ రిస్క్‌ను తీసుకోవటానికి నన్ను ఎంకరేజ్ చేసింది. ప్రేక్షకులను ‘అష్టదిగ్బంధనం’ చేసే కథ, కథనాలు సినిమా హైలైట్.
సినిమా అనేది కళాత్మక వ్యాపారం కదా.. మీరు ఇందులో కళను చూసి నిర్మాణం చేపట్టారా? వ్యాపారం చూసి దిగారా?
బేసిక్‌గా నేను వ్యాపారస్తుణ్ణి. ముందు అయితే ఇది కూడా ఒక వ్యాపారం అనే భావనతోనే దిగాను. ఆ తర్వాత ఇది 24 క్రాఫ్ట్స్‌తో కూడిన కళాకారుల క్రియేటివిటీకి దర్పణం అని అర్ధమైంది. అక్కడి నుంచి దీన్ని ఏ
పాయింట్‌లు సినిమా సక్సెస్‌కు దోహం చేస్తాయని భావిస్తున్నారు?
ఇందులో ప్రేక్షకులను అష్టదిగ్బంధనం చేసే అంశాలు చాలానే ఉన్నాయి. మంచి సస్పెన్స్, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మెన్స్, ఫొటోగ్రఫీ ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అవే సినిమాను సక్సెస్ చేస్తాయని నా నమ్మకం.
బిజినెస్ సైడ్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది?
చాలా బాగుంది. ఆంధ్ర, తెలంగాణల్లో దాదాపు 150 నుంచి 200 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి?
ప్రస్తుతం ఒక సినిమా సెట్స్ మీద ఉంది. త్వరలో దాని వివరాలు తెలియజేస్తాం.
Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook