Bandla Ganesh counter : పవన్ మూవీకి బైక్‌ అమ్మి కటౌట్స్‌ కట్టానన్న మంత్రి.. అందుకే మంత్రి అయ్యావన్న బండ్ల

Bandla Ganesh counter on AP minister Anil Kumar Yadav : ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను తగ్గించడంపై తెలుగు ఇండస్ట్రీ వర్గాలు రియాక్ట్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు వర్సెస్ ఏపీ మంత్రులు అన్నట్లుగా సాగుతోంది కోల్డ్ వార్. మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేశ్.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 08:22 PM IST
  • టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఏపీలో సినిమా టికెట్ల విషయం
  • ఏపీ ప్రభుత్వం మూవీ టికెట్ల రేట్లను తగ్గించడంపై సీరియస్
  • సినీ ప్రముఖులు వర్సెస్ ఏపీ మంత్రులు అన్నట్లుగా సాగుతోంది కోల్డ్ వార్..
 Bandla Ganesh counter : పవన్ మూవీకి బైక్‌ అమ్మి కటౌట్స్‌ కట్టానన్న మంత్రి.. అందుకే మంత్రి అయ్యావన్న బండ్ల

Bandla Ganesh comments on AP Minister Anil Kumar Yadav in social media : టాలీవుడ్‌లో ఇప్పుడు ఏపీలో సినిమా టికెట్ల విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం మూవీ టికెట్ల రేట్లను తగ్గించడంపై తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry) వర్గాలు రియాక్ట్ అవుతున్నాయి. ప​లువురు సినీ ప్రముఖులు ఈ విషయంపై స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా హీరో నాని ఏపీలో సినిమా టికెట్ల (AP Movie tickets) విషయంపై మాట్లాడిన విషయం తెలిసిందే.. ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా మూవీ టికెట్స్ (Movie tickets) రేట్లు తగ్గించడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ గవర్నమెంట్ (AP Government) తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా థియేటర్లు మూతపడుతున్నాయి. శ్యామ్ సింగరాయ్ మూవీకి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూటర్.. టికెట్ల రేట్లు తగ్గడంతో శ్యామ్ సింగరాయ్ (Shyam Singaray) మూవీ బిజినెస్ చేయలేనంటూ మధ్యలో చేతులేత్తేశారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరో నాని (Hero Nani) ఏపీ సినిమా టికెట్లపై రియాక్ట్ అయ్యారు. 

సినిమా థియేటర్‌‌ టికెట్ (Cinema tickets) కలెక్షన్స్‌ కంటే థియేటర్ పక్కనుండే కిరాణా షాపుల్లోనే కలెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయంటూ కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయం ప్రేక్షకులను అవమానించే విధంగా ఉన్నాయంటూ చురకలు అంటించారు. 

ఇక నాని చేసిన కామెంట్స్‌పై ఏపీ మంత్రులు వరుసగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (AP Minister Anil Kumar Yadav) కూడా నాని వ్యాఖ్యలపై కామెంట్స్ చేశారు. అసలు హీరో నాని ఎవరంటూ మాట్లాడారు. ఆయన ఎవరో తనకు తెలియదన్నట్లుగా చెప్పుకొచ్చారు మంత్రి. తనకు కేవలం కొడాలి నాని (Kodali Nani) మాత్రమే తెలుసని పేర్కొన్నారు అనిల్ కుమార్ యాదవ్. 

ఇక హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విషయాన్ని కూడా ప్రస్తావనకు తెచ్చారు మంత్రి. తాను కూడా ఒకప్పుడు పవన్‌కు పెద్ద ఫ్యాన్‌ను అని చెప్పారు. పవన్ కల్యాణ్ మూవీ రిలీజైన సమయంలో తన బైక్‌ను అమ్మి కటౌట్స్‌ (Cutouts‌) కట్టానంటూ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ (Pawan Fans) పరిస్థితి అంతేనంటూ వ్యాఖ్యలు చేశారు. 

Also Read : Actor Siddharth: సినిమా టికెట్ ధరలపై సిద్ధార్థ్ స్పందన- మంత్రులపై సెటైర్లు!

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ కల్యాణ్ పై చేసి వ్యాఖ్యలపై ఇప్పుడు బండ్ల గణేశ్ స్పందించారు. "అందుకే రాష్ట్రానికి మంత్రి అయ్యావ్ అన్నా" అంటూ బండ్ల గణేశ్ (Bandla Ganesh) ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ మూవీలకు బైక్‌ అమ్మి కటౌట్స్‌ కట్టావ్‌ కాబట్టే మంత్రి అయ్యావంటూ బండ్ల గణేశ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. 

 

Also Read : RRR Movie Komuram Bheemudo song : ఆర్ఆర్ఆర్.. ఎన్టీఆర్ కొమురం భీముడో సాంగ్‌ వచ్చేసింది! ఎమోషన్స్ ఇరగదీసిన కాల భైరవ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News