shrihan Awara Zindagi : బిగ్ బాస్ శ్రీహాన్ జోరు మామూలుగా లేదు.. లోపల అలా బయట ఇలా

Bigg Boss Shrihan New Movie Awara Zindagi బిగ్ బాస్ ఇంట్లో సందడిచేస్తోన్న శ్రీహాన్.. బయట తన కొత్త సినిమా అప్డేట్లతో హల్చల్ చేస్తున్నాడు. ఆవారా జిందగీ అనే సినిమా అప్డేట్‌తో ఇప్పుడు సందడి చేస్తున్నాడు. ఫన్ ఓరియెంటెడ్‌గా ఈ మూవీ రాబోతోన్నట్టు టైటిల్ పోస్టర్ చెప్పకనే చెప్పేస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2022, 12:52 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో శ్రీహాన్ సందడి
  • శ్రీహాన్ కొత్త సినిమా పోస్టర్ వైరల్
  • ఆవారా జిందగీ అంటూ శ్రీహాన్ హల్చల్
shrihan Awara Zindagi : బిగ్ బాస్ శ్రీహాన్ జోరు మామూలుగా లేదు.. లోపల అలా బయట ఇలా

Bigg Boss Shrihan-Awara Zindagi : బిగ్ బాస్ ఇంట్లో శ్రీహాన్ అందరినీ అలరిస్తున్నాడు. నవ్విస్తున్నాడు.. ఆటలు ఆడుతున్నాడు.. ఇప్పటి వరకు అయితే పాజిటివ్  ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు. బిగ్ బాస్ ఇంట్లో శ్రీహాన్ చేసే సందడి అలా ఉంటే.. బయట మాత్రం కొత్త సినిమా అప్డేట్లతో సందడి చేస్తున్నాడు. తాజాగా శ్రీహాన్ హీరోగా రాబోతోన్న ఓ సినిమా అప్డేట్ వచ్చింది.  ప్రస్తుతం కామెడీ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. జాతి రత్నాలు సినిమా ఏ రేంజ్లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.

అలాంటి జానర్లోనే శ్రీహాన్ ఇప్పుడు సందడి చేయబోతోన్నాడట. ''ఆవారా జిందగి'' రూపంలో ఆద్యంతం నవ్వించేందుకు శ్రీహాన్ రాబోతోన్నాడట.  ఆడియన్స్ కోరుకునే విధంగా కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కించారు. నలుగురు కుర్రోళ్ళ నడుమ నడిచే ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. జీరో లాజిక్ 100% ఫన్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రానుండటం ఆసక్తికర అంశం. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించేలా ఈ సినిమా కథ ఎంచుకొని ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ లో తెరకెక్కించారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దేప శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ ఆవారా జిందగీ రూపొందుతోంది. ఈ చిత్రానికి నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఖర్చుకు ఎక్కడా వెనక్కి తగ్గకుండా సినిమా హై క్వాలిటీ నిర్మాణానికి ప్రియార్టీ ఇచ్చారు. కంభంపాటి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరించగా.. ప్రతీక్ నాగ్ సంగీతం అందించారు.

బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ ప్రధాన పాత్రల్లో ఆధ్యంతం కామెడీ యాంగిల్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా శ్యామ్ ప్రసాద్ V, ఉరుకుంద రెడ్డి S పని చేయగా.. S B రాజు తలారి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. మంచి అవుట్‌పుట్ తో రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అతిత్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. శ్రీహాన్ బిగ్ బాస్ ఇంట్లో చివరి వరకు ఉండేట్టు కనిపిస్తోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ల లిస్ట్‌లో శ్రీహాన్ ఉంటాడు. ఇప్పటి వరకు శ్రీహాన్ మీద అంతగా నెగెటివ్ ఇమేజ్ అయితే ఏర్పడలేదు. బిగ్ బాస్ ఇమేజ్ అనేది ఈ సినిమాకు కచ్చితంగా పనికి వచ్చేలా కనిపిస్తోంది.

Also Read : Adipurush First Look : రాముడికి మీసాలు గడ్డాలు ఉంటాయా?.. వీడియో వైరల్

Also Read : Bigg Boss Arohi : నాలుగో వారం ఎలిమినేషన్.. ఆరోహి అవుట్.. సురోహి ట్రాక్ సమాప్తం?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News