allu arjuna vs revanth reddy pushpa 2 movie stampede controversy: పుష్ప2 మూవీ ఒక వైపు ప్రపంచ రికార్డులు నెలకోల్పుతుంది. మరోవైపు ఆ మూవీలో హీరోగా చేసిన అల్లు అర్జున్ కు మాత్రం ఆ ఆనందమే లేకుండా పోయిందని చెప్పుకొవచ్చు. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. అదే విధంగా దీనిపై ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు కావడం, హైకోర్టు మధ్యంత బెయిల్ ఇవ్వడం వంటివి చక చక జరిగిపోయాయి. అయితే.. ఈ ఘటన తర్వాత అనేక నాటకీయ పరిణామలు చోటు చేసుకున్నాయని చెప్పుకొవచ్చు.
ముఖ్యంగా సీఎం రేవంత్ నిన్న అసెంబ్లీలో ఈ ఘటనపై పుష్ప2 మూవీ వై వైల్డ్ ఫైర్ అయ్యారు. అసలు.. ఆ రోజు అల్లు అర్జున్ రావడం వల్లే.. ఇదంతా జరిగిందన్నారు. పోలీసులు అనుమతి నిరాకరించిన కూడా డిసెంబరు 4న రాత్రి థియేటర్ కు వచ్చారన్నారు. అప్పుడు ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయలేని విధంగా అక్కడ సిట్యూవేషన్ మారిపోయిందన్నారు.
చివరకు పోలీసలు వచ్చి అల్లు అర్జున్ ను వెళ్లమన్నాకూడా.. కారులో కూర్చుని మరల రూఫ్ ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేశారన్నారు.మరోవైపు అల్లు అర్జున్ రాత్రి కూడా రాత్రి ప్రెస్ మీట్ పెట్టి అసలు.. తనను ఏ పోలీసులు వెళ్లమనలేదని, తన టీమ్ వచ్చి చెపితే.. వెళ్లిపోయానని అన్నారు. రోడ్ షో చేశాననడంలో నిజంలేదన్నారు. అదే విధంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లను ప్రస్తావించారు.
గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదో కారణంలో చనిపోయినప్పుడు తాను స్వయంగా వెళ్లి కలిశానని గుర్తు చేశారు. దీనిపైన ఇప్పుడు రచ్చ నడుస్తొంది. కొన్ని రోజులుగా అల్లు వర్సెస్ మెగా ప్యామిలీగా మారిందని వార్తలు వచ్చాయి. పుష్ప2 మూవీ విడుదలయ్యాక.. పుష్ప2 మూవీ టీమ్ వెళ్లి చిరంజీవిని కలిశారు. కానీ బన్నీ కలవలేదు. ఎప్పుడైతే.. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడో.. మరల ఈ రెండు ఫ్యామిలీలు కలవడం వంటి సన్నివేశాలు కన్పించాయి. అయితే.. ప్రస్తుతం ఒకవైపు రేవంత్ మాత్రం.. ఈ ఘటనపై సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తొంది.
ఇటీవల చిరు ఇంటికి బన్నీ వెళ్లడం కూడా తెలిసిందే. అందుకే.. ఇప్పుడు.. తనకు సంభవించిన ఈ ఆపద నుంచి కాపాడాలని.. ఇన్ డైరెక్ట్ గా కూడా బన్నీ.. చిరు, పవన్ జపం చేశారని కొందరు నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారంట. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, మరొవైపు.. ఏపీలో సీఎం చంద్రబాబు సైతం.. వెనుకుండీ.. తన శిష్యుడు రేవంత్ తో ఇదంతా చేయిస్తున్నాడని ఇటీవల ప్రచారం జరుగుతుంది.
Read more: Allu Arjun Press meet: నేను రోడ్ షో చేయలేదు.. రేవంత్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్..?..
అయితే.. చిరంజీవి, పవన్ కలిస్తే.. తనకు కల్గిన ఈ గండం నుంచి గట్టేక్కిస్తారని.. ప్రస్తుతం అల్లు అర్జున్ భావిస్తున్నారంట. చిరుకు రేవంత్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా పవన్ కళ్యాన్ అటూ ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడితే.. తనకు రిలీఫ్ దొరకొచ్చని బన్నీ అనుకుంటున్నారంట. అందుకే తాజాగా.. పవన్ , చిరంజీవీల పేరు అల్లు అర్జున్ ప్రస్తావించాడని సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter