Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి దగ్గర హైటెన్షన్.. రాళ్లదాడి.. వీడియో వైరల్..

Pushpa 2 movie stampede: అల్లు అర్జున్ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొందని తెలుస్తొంది. ఓయూ జేఏసీ నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. కొంత మంది రాళ్లను ఇంటిపై వేసి నిరసనవ్యక్తం చేసినట్లు తెలుస్తొంది..

Written by - Inamdar Paresh | Last Updated : Dec 22, 2024, 05:47 PM IST
  • అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లదాడి..
  • నినాదాలు చేసిన జేఏసీ నేతలు..
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి దగ్గర హైటెన్షన్.. రాళ్లదాడి.. వీడియో వైరల్..

Pushpa 2 movie stampede: పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే ఈ ఘటన పొలిటికల్ టర్న్ కూడా తీసుకుందని చెప్పుకొవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనను ఖండిస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ లు మాత్రం.. అల్లు అర్జున్ కు అండగా ఉన్నట్లు తెలుస్తొంది. సీఎం రేవంత్  రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పై మండిపడ్డారు.

Add Zee News as a Preferred Source

మరొవైపు అల్లు అర్జున్ కూడా.. తగ్గెదేలా అన్న విధంగా రాత్రికి ప్రెస్ మీట్ పెట్టి మరీ తనదైన శైలీలో వివరణ ఇచ్చుకున్నారు. తెలంగాణ డీజీపీ సైతం.. అల్లు అర్జున్ పై తమకు ఎలాంటి కోపంలేదని.. కేవలం అందరిలానే ఆయన్ను కూడా ట్రీట్ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా.. సెలబ్రీటీలకు ఒక చట్టం, సామాన్యులకు మరొలా చట్టాలు ఉండవన్నారు. మరొవైపు కాంగ్రెస్ మంత్రులు, నేతలు సైతం.. అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డిని కించపర్చేవిధంగా మాట్లాడారన్నారు.

 

 

కోమటి రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలలో అన్ని నిజాలు ఉన్నాయన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం.. అవేంజరగలేదని అనడం సరికదాన్నారు. వెంటనే తన వ్యాఖ్యల్ని అల్లు అర్జున్ వెనక్కు తీసుకొవాలన్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఓయూ జీఏసీ సైతం.. అల్లు అర్జున్ వైఖరీపై మండిపడినట్లు తెలుస్తొంది. ఈ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబం  పట్ల.. అల్లు అర్జున్ సరిగ్గా స్పందించలేదని ఫైర్ అయినట్లు సమాచారం.

శ్రీతేజ్ ఇన్ని రోజుల నుంచి ఆస్పత్రిలో ఉంటే.. ఒక్కరైన వెళ్లి కలిశారా అని మండిపడినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఓయూ జేఏసీ..అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తొంది. కొంతమంది ఓయూ జాక్ నేతలు.. అల్లు అర్జున్ ఇంటి దగ్గరకు వెళ్లి .. తమ నిరసన తెలిపారు. అక్కడున్న పూలకుండీలను ధ్వంసం చేసినట్లు సమాచారం. 

Read more: Allu Arjun: ఇక మీదట విశ్వరూపమే..! ఆ పోస్టులపై వైల్డ్ ఫైర్ అయిన అల్లు అర్జున్.. ఎక్స్ లో సంచలన ట్విట్..

అదే విధంగా.. ఆయన ఇంటిపై నినాదాలు చేసుకుంటూ రాళ్లదాడి సైతం చేసినట్లు సమాచారం.  ఈ క్రమంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఎవరు బైట కన్పించలేదని తెలుస్తొంది. మరొవైపు కొంత మంది గోడలు దూకీ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న సెక్యురిటీ వారు.. ఆందోళన కారుల్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొందని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News