Maharani 3: బీహార్ రాజకీయాల థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ మహారాణి 3 స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది, ఎప్పుడంటే

Maharani 3: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ నటించిన థ్రిల్గింగ్ పొలిటికల్ వెబ్‌సిరీస్ మహారాణి మూడో సీజన్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారికి నిరీక్షణ తప్పింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 20, 2024, 09:45 AM IST
Maharani 3: బీహార్ రాజకీయాల థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ మహారాణి 3 స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది, ఎప్పుడంటే

Maharani 3: బీహార్ రాజకీయాల నేపధ్యంలో సాగే హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ మహారాణి వెబ్‌సిరీస్. ఇప్పటికే రెండు సీజన్లతో అందరినీ ఆకట్టుకోవడంతో సహజంగానే సీజన్ 3పై ఆసక్తి పెరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేవారికోసం స్ట్రీమింగ్ డేట్ ఎనౌన్స్ అయింది. 

బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మహారాణి వెబ్‌సిరీస్ ఇటీవలి కాలంలో బాగా ఆదరణ పొందిన వెబ్‌సిరీస్‌లలో ఒకటి. బీహార్ రాజకీయాల నేపధ్యంలో సాగే ఈ వెబ్‌సిరీస్ సోనీ లివ్‌లో ఇప్పటికే రెండు సీజన్లు ప్రసారమైంది. రెండూ సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 1990 నాటి బీహార్ రాజకీయాల్ని కళ్లముందు ఉంచే వెబ్‌సిరీస్ ఇది. బీహార్ రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయనేది మహారాణి వెబ్‌సిరీస్ సీజన్ 1, సీజన్ 2లో కన్పించింది. రెండవ సీజన్ చివరిలో జైలుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి రాణి భారతి...బయటికొచ్చాక అధికారం చేజిక్కించుకుంటుందా లేదా అనేది మూడవ సీజన్‌లో ఉండటంతో అందరికీ సీజన్ 3పై ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. జైళ్లో ఆమెను కలిసిన ప్రత్యర్ధి, ముఖ్యమంత్రి నవీన్ కుమార్...మరో 15,20 ఏళ్లు జైళ్లోనే ఉంటావు, గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ కూడా పూర్తి చేయమని హెచ్చరించడం ఆసక్తి రేపుతుంది. 

ఈలోగా పిల్లలపై జరిగిన హత్యాయత్నంతో తల్లడిల్లి బెయిల్‌పై బయటికొస్తుంది. ఇక అక్కడ్నించి ప్రత్యర్ధుల్ని ఎలా ఎదుర్కొంటుందనేది చాలా ఆసక్తిగా చూపించారు. సుభాష్ కపూర్ కధ అందించగా సౌరభ్ భావే దర్శకత్వం వహించాడు. మహారాణి సీజన్ 3 సోనీ లివ్‌లో మార్చ్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

Also read: Pooja Hegde Saree Pics: చీరలో మెరిసిన బుట్టబొమ్మ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News