Black Adam 4DX : 4DX ఎప్పుడైనా ఎక్స్‌పీరియెన్స్ చేశారా?.. అదిరిపోయిన యాక్షన్ సీక్వెన్స్

Black Adam 4DX Movie హాలీవుడ్ మూవీ బ్లాక్ ఆడమ్ సినిమా ఇప్పుడు హైద్రాబాద్‌లో రన్ అవుతోంది. అయితే ఈ చిత్రం రెండు థియేటర్లో మాత్రమే ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2022, 10:58 AM IST
  • హలీవుడ్ బ్లాక్ ఆడమ్ సినిమా
  • 4DX ఎక్స్ పీరియెన్స్ అదుర్స్
  • కెమెరాకు అనుగుణంగా కదిలే సీట్లు?
Black Adam 4DX : 4DX ఎప్పుడైనా ఎక్స్‌పీరియెన్స్ చేశారా?.. అదిరిపోయిన యాక్షన్ సీక్వెన్స్

Black Adam 4DX Movie : కొన్ని సినిమాలను థియేటర్లోనే చూడాలి. ఇంకొన్ని సినిమాలు ఓటీటీలోనే చూడాల్సి ఉంటుంది. అలా దేని అనుభూతి దానిది. దేని అనుభవం దానిది. అయితే కొన్ని చిత్రాలు మాత్రం కచ్చితంగా థియేటర్లో చూస్తేనే మజా వస్తుంది. పైగా 4DXలో తెరకెక్కించిన మూవీని.. 4DX థియేటర్లో చూస్తేనే కిక్ వస్తుంది. అయితే 4DX అందించే థియేటర్లు అన్ని చోట్లా ఉండకపోవచ్చు. మామూలుగానే త్రీడీ స్క్రీన్‌లే మన దగ్గర ఎక్కువగా లేవు. ఇక 4DX అందించే థియేటర్లు అత్యంత అల్పంగా ఉన్నాయి.

హైద్రాబాద్‌లో 4DX ఎక్స్‌పీరియెన్స్ అందించే థియేటర్లు రెండు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం బ్లాక్ ఆడమ్ సినిమాను 4DXలో చూడాలంటే ఆ రెండు థియేటర్లో మాత్రమే చూడగలం. పీవీఆర్ ఎర్రమంజిల్, కూకట్‌పల్లిలోని థియేటర్లో మాత్రమే 4DX అందుబాటులో ఉంది. ఈ 4DX థియేటర్ సెటప్ అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. 

4DX థియేటర్లో సీట్ల ఆర్డర్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. నాలుగు నాలుగు సీట్లు కలిసి ఉంటాయి. ఆ నాలుగు సీట్లు థియేటర్లో వచ్చే సౌండ్‌ల ఆధారంగా కదులుతుంటాయి. స్క్రీన్ మీద వచ్చే సౌండ్లు, కెమెరా కదిలికలకు తగ్గట్టుగా అటూ ఇటూ ముందుకు వెనక్కి కదులుతుంటాయి. అలా మొత్తానికి 4DX థియేటర్లో బ్లాక్ ఆడమ్ సినిమాను ఎక్స్‌పీరియెన్స్ చేస్తే వచ్చే కిక్కే వేరు.

బ్లాక్ ఆడమ్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు, పోరాట దృశ్యాలు అన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తాయి. యాక్షన్ సీక్వెన్స్‌లకు తగ్గట్టుగా సీట్లు కదులుతుంటే.. మనం నిజంగానే తెర లోపలకు వెళ్లినట్టు అనిపిస్తుంది. ఇక ఇందులో బ్లాక్ ఆడమ్ ఆవిర్భావం సీన్లు, ఇంట్రడక్షన్ సీన్లు, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ఇలా అన్నీ కూడా అద్బుతంగా అనిపిస్తాయి. అయితే కథ మాత్రం అంత ట్విస్టులతో ఏమీ సాగదు. కానీ విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం అదిరిపోతాయి. కచ్చితంగా 4DX ఎక్స్ పీరియెన్స్ మాత్రం చేయాల్సిందే అన్నట్టుగా ఉంటుంది.

Also Read : Liger - Vijay Devarakonda : కనీసం ఫోన్‌ కూడా ఎత్తడం లేదా?.. విజయ్‌-పూరి మధ్య సంబంధాలు తెగిపోయాయా?

Also Read : Samantha Face Surgery : సమంత మొహానికి ప్లాస్టిక్ సర్జరీ?.. ఆ ఫోటోలతోనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News