Sarkaru Vaari Paata: ప్రిన్స్ మూవీ విలన్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ ?

ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ( Mahesh babu ) కోసం గుడ్ న్యూస్. మహేష్ నటిస్తోన్న సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సినీవీధుల్లో చక్కర్లు కొడుతోంది.

Last Updated : Sep 6, 2020, 05:40 PM IST
    • ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ( Mahesh babu ) కోసం గుడ్ న్యూస్. మహేష్ నటిస్తోన్న సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సినీవీధుల్లో చక్కర్లు కొడుతోంది.
    • ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు తో మెగా హిట్ సొంతం చేసుకున్న ప్రిన్స్ ప్రస్తుతం సర్కారు వారి పాట ( Sarkaru vaari Paata ) అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
    • ఈ మూవీని పరుశురామ్ డైరక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ మూవీలో మేహేష్ బాబు డబుల్ రోల్ చేయనున్నాడు అని తెలుస్తోంది.
Sarkaru Vaari Paata: ప్రిన్స్ మూవీ విలన్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ ?

ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ( Mahesh babu ) కోసం గుడ్ న్యూస్. మహేష్ నటిస్తోన్న సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సినీవీధుల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు తో మెగా హిట్ సొంతం చేసుకున్న ప్రిన్స్ ప్రస్తుతం సర్కారు వారి పాట ( Sarkaru vaari Paata ) అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీని పరుశురామ్ డైరక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ మూవీలో మేహేష్ బాబు డబుల్ రోల్ చేయనున్నాడు అని తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమా గురించి తెలిసిన విషయం ఏంటంటే.. ఈ సర్కారువారి పాట మూవీలో బాలీవుడ్ లఖన్, సూపర్ స్టార్ అనిల్ కపూర్ ( Anil Kapoor ) విలన్ గా నటించనున్నాడట. దర్శకుడు పరుశురామ్ సినిమా కథను అనిల్ కు వినిపించగా ఆయనకు స్టోరీ నచ్చడంతో వెంటనే అంగీకరించాడని టాక్.  ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా, మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

 

Trending News