Hi Nanna: టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మరో బాలీవుడ్ హీరో.. నాని సినిమాలో విలన్‌గా ..

Hi Nanna: ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోలు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. కొందరు విలన్ పాత్రల్లో కనిపిస్తుంటే.. మరికొందరు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ హీరో నాని సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 27, 2023, 06:08 AM IST
Hi Nanna: టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మరో బాలీవుడ్ హీరో.. నాని సినిమాలో విలన్‌గా ..

Hi Nanna Movie Update: మరో బాలీవుడ్ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నాని సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని (Nani) 'హాయ్ నాన్న(Hi Nanna)' అనే సినిమాలో నటిస్తున్నాడు. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌లో బీటౌన్ నటుడు అంగద్ బేడి(Angad Bedi) నటించనున్నాడు.

ఇతడు హిందీ చిత్రపరిశ్రమలో పింక్, టైగర్ 3 అనే చిత్రాల్లో నటించాడు. గత కొన్ని రోజులుగా ఇతను హాయ్ నాన్నలో నటించున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని ఖరారు చేశాడు నటుడు అంగద్ బేడి.  నా గత సినిమాలను తెలుగు అడియెన్స్ బాగా ఆదరించారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అయితే ఈ సినిమాలో బేడీ విలన్‌గా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రంలో నానికి జోడీగా 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur) నటిస్తుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ కానుకగా అంటే డిసెంబరు 21న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. హీరో హీరోయిన్స్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో శ్రుతిహాసన్ మరో కీలకపాత్రలో నటించనుంది. నానికి పోటీగా సీనియర్ వెంకటేష్ సైంధవ్ తో రాబోతున్నాడు. అంతేకాకుండా నితిన్ కూడా 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' వస్తున్నాడు.

Also read: Prabhas: మలయాళ స్టార్ హీరో డైరెక్షన్‏లో ప్రభాస్.. డార్లింగ్ నయా ఫ్లాన్ తో బాక్సాఫీస్ షేక్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

                                                      

Trending News