Kalinga Teaser: ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి.. భయంకరంగా ‘కళింగ’ టీజర్

Kalinga Movie Teaser Updates: కళింగ మూవీ టీజర్‌ను బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ రిలీజ్ చేశారు. ధృవ వాయు హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తూ తెరకెక్కిన ఈ మూవీ టీజర్ భయకంరంగా ఉంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 5, 2024, 06:35 PM IST
Kalinga Teaser: ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి.. భయంకరంగా ‘కళింగ’ టీజర్

Kalinga Movie Teaser Updates: కిరోసిన్ హిట్‌తో పేరు తెచ్చుకున్న ధృవ వాయు మరోసారి సరి కొత్త కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘కళింగ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ టీజర్‌ను విడుదల చేసి అభినందించారు.

టీజర్ ప్రారంభంలోనే ఒక అమ్మాయి తన చెవిని తానే కోసుకుని తినే సీన్ ఒళ్లు గగుర్పొడిచేలా తెరకెక్కించారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న కళింగ టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా, గ్రిప్పింగ్ కథనంతో అందరినీ మెప్పించేలా ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది.

కళింగ టీజర్‌లో అన్ని రకాల అంశాలను జోడించారు. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను చూపించేలా కట్ చేసిన టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది. ఇది ప్రేక్షకులను భయపెట్టేలా ఉందని మాత్రం చెప్పొచ్చు. సంస్థానం అనేది పెద్ద పద్మవ్యూహం.. అక్కడికి పోవడమే కానీ తిరిగి రావడం ఉండదు.. అనే డైలాగ్స్.. ధృవ వాయు యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్.. విజువల్స్, ఆర్ఆర్ ఈ టీజర్లో ప్రత్యేకంగా హైలెట్ అవుతున్నాయి. 

ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తుండగా, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రఫీ.. విష్ణు శేఖర, అనంత నారాయణన్ AG సంగీతం ప్రధాన ఆకర్షణ కానున్నాయి.

తారాగణం: ధృవ వాయు, ప్రజ్ఞా నయన్, అడుకలం నరేన్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, షిజు ఏఆర్, మురళీధర్ గౌడ్, సమ్మెట గాంధీ, ప్రీతి సుందర్ కుమార్, బలగం సుధాకర్, ప్రార్ధిని, సంజయ్ కృష్ణ, హరిశ్చంద్ర తదితరులు

==> సాంకేతిక బృందం
==> బ్యానర్ : బిగ్ హిట్ ప్రొడక్షన్స్
==> నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృథ్వీయాదవ్
==> దర్శకత్వం: ధృవ వాయు 
==> కెమెరామెన్ : అక్షయ్ రామ్ పొడిశెట్టి 
==> సంగీత దర్శకుడు: విష్ణు శేఖర, అనంత నారాయణన్ 
==> పీఆర్వో : సాయి సతీష్

 

Trending News