Love ME: ఆశిష్, వైష్ణవి చైతన్య సినిమా టైటిల్ ప్రకటన..కథ వినగానే ఎక్సైట్ అయ్యాను.. అంటున్న దిల్ రాజు

Ashish and Vaishnavi Chaitanya: మంచి సినిమాలను ఆదరించడంలో ఎప్పుడు ముందర ఉంటారు నిర్మాత దిల్ రాజు. వైవిద్యమైన కథలను నిర్మించడం, డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా వాటికి తన వంతు సపోర్టు కూడా చేస్తూ ఉంటారు..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2024, 07:00 PM IST
Love ME: ఆశిష్, వైష్ణవి చైతన్య సినిమా టైటిల్ ప్రకటన..కథ వినగానే ఎక్సైట్ అయ్యాను.. అంటున్న దిల్ రాజు

Dil Raju: రౌడీ బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్. ఈ నటుడు హీరోగా బేబీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వస్తున్న సినిమా లవ్ మీ. ఈ సినిమాని శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్రకటన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సినిమాకు ‘లవ్ మీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘ఇఫ్ యూ డేర్’ అనేది ఉప శీర్షిక. 

ఈ టైటిల్ ప్రకటన ఈవెంట్ లో ఈ సినిమా యూనిట్ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఆశిష్ ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. అందుకే ఆశిష్ ఈవెంట్ కి అటెండ్ కాలేకపోయారు. లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనేది మొదలవ్వడానికి నాగ, అరుణ్ కారణం. నాకు నాగ ఎప్పటి నుంచో పరిచయం. ఓ కథ చెబుతాను వినండి.. నా ఫ్రెండ్‌తో కలిసి చేశామని అన్నాడు. అప్పుడు అరుణ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ స్క్రిప్ట్ విన్న క్షణమే ఓ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లా. ఆర్య కథ విన్నప్పుడు నేను ఎంతగా ఎగ్జైట్ అయ్యానో.. మళ్లీ అలా ఎగ్జైట్ అయ్యాను. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ఆశిష్ హీరోగా కావాలని అడిగారు. అలానే హర్షిత్, హన్షిత్‌ను ఇవ్వండని నాగ అడిగారు. కథ చెప్పి నన్ను గెలిచారు. కొత్త వాళ్లతో ‘బలగం’ తీశాం. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయాలని దిల్ రాజు ప్రొడక్షన్స్ పెట్టాం. ఈ కథను చాలా మందికి చెప్పాం. అందరూ ఎగ్జైట్ అయ్యారు. స్క్రిప్ట్ పూర్తయ్యాక.. టెక్నీషియన్స్ పేర్లు చెబితే నాకు భయం వేసింది. పీసీ శ్రీరామ్ గారికి స్క్రిప్ట్ వినమని చెప్పాను. ఆయన స్క్రిప్ట్ చదివి వెంటనే ఓకే చెప్పారు. మ్యూజిక్ విషయంలో కీరవాణి కావాలన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటివి చేస్తున్నారు.. ఆయన మీకు దొరుకుతాడా?  అని అడిగాను. కానీ కీరవాణి గారు ఈ సినిమా స్క్రిప్ట్ విని వెంటనే ఓకే చెప్పారు. హీరోయిన్ కోసం వెతుకుతున్న టైంలో బేబీ పెద్ద హిట్ అయింది. ఆఫీస్‌కు వచ్చి స్క్రిప్ట్ పూర్తిగా చదివి ఫుల్ ఎగ్జైట్ అయింది. ఇలా ఓ స్క్రిప్ట్ ఈ రేంజ్‌లో ఎగ్జైట్ చేయించడం చాలా అరుదుగా చూస్తాం’ అని చెప్పుకొచ్చారు .

‘ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంటుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. ఫిబ్రవరి 27న టైటిల్ ప్రకటించారు. ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయనున్నాము. నాకు ఆర్య విషయంలో ఏం జరిగిందో.. మీ అందరికీ అదే జరగబోతోందనే వైబ్స్ వస్తున్నాయి’ అని తెలియజేశారు దిల్ రాజు.

ఆ తరువాత హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘ ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ కథ విన్నప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఆ వైబ్స్ వస్తుంటాయి. అదే ఎగ్జైట్మెంట్ ఇప్పటికీ ఉంది. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇలాంటి పాయింట్ నేను ఏ సినిమాలోను చూడలేదు. త్వరలోనే టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. టీజర్ అందరికీ డిఫరెంట్ వైబ్‌ను కలిగిస్తుంది. థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌తో వస్తారు’ అని తెలియజేశారు.

Also Read: Kuppam: చంద్రబాబును ఓడించండి.. కుప్పం అభివృద్ధి చేసుకుందాం: సీఎం జగన్‌ పిలుపు

Also Read: Floating Bridge: లేదు లేదు 'తేలియాడే వంతెన' కొట్టుకుపోలే.. మేమే దాన్ని విడదీశాం

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x