Akhanda Sequel : అఖండ మూవీ సీక్వెల్‌పై బోయపాటి శ్రీను క్లారిటీ.. అసలు విషయం అప్పుడు చెప్తా!

Boyapati Srinu gives clarity on Akhanda Movie Sequel : అఖండ మూవీ సక్సెస్ కావడంతో సంతోషంగా ఉంది మూవీ యూనిట్. ఈ నేపథ్యంలో బాలకృష్ణ అఖండ మూవీ సీక్వెల్‌పై డైరెక్టర్‌‌ బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 07:35 PM IST
  • అఖండ మూవీ సక్సెస్ కావడంతో సంతోషంగా ఉన్న మూవీ యూనిట్
  • బాలయ్య అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పిన బోయపాటి
  • సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
Akhanda Sequel : అఖండ మూవీ సీక్వెల్‌పై బోయపాటి శ్రీను క్లారిటీ.. అసలు విషయం అప్పుడు చెప్తా!

Director Boyapati Srinu gives clarity on Balakrishna Akhanda Movie Sequel : ఇటీవల విడుదలైన బాలకృష్ణ (Balakrishna) మూవీ అఖండ మూవీ భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. బాలయ్య అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా వచ్చిన ఈ మూవీకి విశేష ఆదరణ లభించింది. డైరెక్టర్‌‌ బోయపాటి శ్రీను (Director Boyapati Srinu) తెరకెక్కించిన ఈ మూవీలో బాలకృష్ణ డబుల్‌ రోల్‌లో నటించారు. జగపతి బాబు, (Jagapathi Babu) శ్రీకాంత్‌, పూర్ణతో పాటు తదితరులు అఖండ మూవీలో కీలక పాత్రలు పోషించారు. 

మిర్యాల రవీందర్‌రెడ్డి (Miryala Ravinder Reddy) నిర్మించిన అఖండ మూవీ (Akhanda Movie) 2021 డిసెంబరు 2న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. హాట్‌స్టార్‌లో (Hotstar) జనవరి 21 నుంచి అఖండ స్ట్రీమింగ్‌ కానున్న విషయం తెలిసిందే. 

అయితే బాలకృష్ణ కెరీర్‌లోనే (Balakrishna Career‌) అత్యధిక గ్రాస్‌ వసూళ్లు చేసిన మూవీగా అఖండ నిలిచింది. ఓవర్సీస్‌లో కూడా మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది అఖండ. కోవిడ్ (Covid) ఉన్నప్పటికీ అన్‌సీజన్‌లో రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ మూవీ. 

Also Read : andem Kollu: సంక్రాంతికి సిద్ధమైన పందెం కోళ్లు..ఒక్కొక్కటి లక్ష వరకూ ధర

ఇక అఖండ మూవీ సక్సెస్ (Akhanda Success) కావడంతో మూవీ యూనిట్ సంతోషంగా ఉంది. తాజాగా అఖండ మూవీ థ్యాంక్స్ మీట్ లో (Thanks Meet) డైరెక్టర్ బోయపాటి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. అఖండ మూవీకి సీక్వెల్ ( Akhanda Movie Sequel) లేదా రీమేక్ ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు బోయపాటి. అఖండ మూవీకి కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. అఖండ మూవీలోనే సీక్వెల్ కు సంబంధించిన లీడ్ కూడా వదిలామని చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా.. అనేది మాత్రం సస్పెన్స్ అని అన్నారు బోయపాటి. ఈ విషయంపై ఫుల్ క్లారిటీ త్వరలోనే  ఇస్తామని బోయపాటి శ్రీను ( Boyapati Srinu) స్పష్టం చేశారు. సో... నందమూరి ఫ్యాన్స్‌కు ఇది ఒక హ్యాపీ న్యూస్‌.. అఖండ‌‌-2తో (Akhand‌‌-2) మళ్లీ బాలయ్య అదరగొట్టనున్నాడని అర్థమవుతోంది.

Also Read : Ys jagan Sankranthi Wishes: తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News