Happy Birthday Allu Sirish: అల్లు శిరీష్ 6వ సినిమా Prema Kadanta ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్

First Look Of Allu Sirish New Movie Prema Kadanta Revealed : యంగ్ హీరో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్రేమ కాదంట’. శిరీష్ బర్త్‌డే సందర్భంగా ప్రేమ కాదంట మూవీ టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్లను రివీల్ చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 30, 2021, 03:23 PM IST
  • మెగా హీరో అల్లు శిరీష్ 6వ సినిమా టైటిల్ ఖరారైంది
  • అల్లు శిరీష్ సరసన జత కట్టిన నటి అను ఇమ్మాన్యుయేల్
  • ప్రేమ కాదంట మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రివీల్ చేసిన యూనిట్
Happy Birthday Allu Sirish: అల్లు శిరీష్ 6వ సినిమా Prema Kadanta ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్

Happy Birthday Allu Sirish | నేడు మెగా హీరో అల్లు శిరీష్ పుట్టినరోజు (మే 30) సందర్భంగా అభిమానులకు అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. యంగ్ హీరో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్రేమ కాదంట’. శిరీష్ బర్త్‌డే సందర్భంగా ప్రేమ కాదంట మూవీ టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్లను రివీల్ చేశారు.

నటుడు శిరీష్ తండ్రి, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు శిరీష్ 6వ సినిమా తెరకెక్కుతోంది. ప్రీ లుక్‌కు సైతం మంచి స్పందన లభించింది. నగరాలలో యువతీయువకుల మధ్య ఉండే రిలేషన్‌షిప్స్ ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. అల్లు శిరీష్ (Actor Allu Sirish) బర్త్‌డే సందర్భంగా రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ప్రేమ కాదంట మూవీ యూనిట్ రివీల్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్లను గమనిస్తే విజేత, జతకలిసే సినిమాలను తెరకెక్కించిన రాకేష్ శశి ఈ మూవీకి దర్శకత్వం వహించగా, ఎం విజయ్ నిర్మతగా వ్యవహరించనున్నారు. అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంయుక్తంగా ప్రేమ కాదంట మూవీకి సంగీతం సమకూర్చనున్నారు. 

Also Read: Rashmi Gautam in Nagarjuna film: నాగార్జున సినిమాలో యాంకర్ రష్మీ గౌతమ్ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News