Mahesh Babu - Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన మూవీ 'గుంటూరు కారం'. గతంలో వీళ్లిద్దరి కలయిలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అందులో అతడు మూవీ క్లాసిక్‌గా నిలిస్తే.. ఖలేజా మూవీ సిల్వర్ స్క్రీన్ పై కాకుండా స్మాల్ స్క్రీన్ పై సూపర్ హిట్టైయింది. దీంతో గుంటూరు కారం మూవీపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమాకు మిక్స్‌డ్ సొంతం చేసుకుంది. అది వసూళ్లపై ప్రభావం చూపించింది.
గుంటూరు కారం మూవీకి మొదటి రోజు మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు త్రివిక్రమ్ స్టార్ డమ్ వంటివి ఈ సినిమాకు బాగానే కలిసొచ్చి మంచి కలెక్షన్స్‌నే రాబట్టింది.అంతేకాదు రూ. 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో నాన్ ప్యాన్ ఇండియా క్యాటగిరిలో హైయ్యెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సాధించిన మూవీగా రికార్డులకు ఎక్కింది.మరోవైపు ఈ సినిమాకు పోటీగా విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం గుంటూరు కారం సినిమాకు మైనస్‌గా మారింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ సినిమా దూకుడును సైతం తట్టుకుంటూ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. మరోవైపు ఈ సినిమాకు ఈ ఫలితం రావడంపై అందరు గురూజీ (త్రివిక్రమ్) వైపు వేలెత్తి చూపెడుతున్నారు.
బిగ్ స్టార్ హీరోను పెట్టుకొని కేవలం సింగిల్ లైన్ పాయింట్ తో ఈ సినిమాను చుట్టేసాడనే చెడ్డ పేరు మాటల మాంత్రికుడికి వచ్చింది. తల్లితో కుమారుడికి ఎలాంటి సంబంధం లేదంటూ ప్రామిసరి నోట్ రాసి ఇవ్వడంపైనే ఈ సినిమా కథను నడింపించాడు. అందులో మహేష్ బాబు మాస్ క్యారెక్టర్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ క్యారెక్టర్‌ను రాసుకున్నాడు త్రివిక్రమ్. అంతేకాదు మహేష్ బాబును కొత్తగా చూపించడంతో పాటు పోకిరి తరహాలో వింటేజ్ లుక్ పై పెట్టిన శ్రద్ధ కథ, కథనాలపై పూర్తిగా కేటాయించ లేకపోయాడు గురూజీ. మొత్తంగా త్రివిక్రమ్ ఈ సినిమాను మహేష్ బాబు ఇమేజ్‌ను నమ్ముకునే తెరకెక్కించాడు. ఆయన నమ్మకాన్ని మహేష్ బాబు నిలబెట్టాడు.మొత్తంగా పండగ సీజన్‌లో ఇలాంటి టాక్‌తో ఈ సినిమా దాదాపు 85 శాతం రికవరీ సాధించడం వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు పండగ సీజన్ కూడా కలిసి వచ్చింది.
ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందు కుర్చీ మడతపెట్టి సాంగ్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేయించడంపై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. కానీ విడుదల తర్వాత అదే ఈ సినిమాకు ప్లస్‌గా మారింది. ఈ పాటలో మహేష్ బాబు.. శ్రీలీలతో కలిసి వేసిన స్టెప్పులతో థియేటర్స్ అదిరిపోయాయి. తాజాగా ఈ పాట ఫుల్ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసారు మేకర్స్. ఇపుడీ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#KurchiMadathapetti Full Video Song is Out, Now Enjoy the Electrifying Dance moves of SUPER🌟 @urstrulyMahesh @sreeleela14 🔥🕺💃
A @MusicThaman Musical 🎹
✍️ @ramjowrites
🎤 @itsahithii @srikrisin #GunturKaaram #Trivikram #Thaman @meenakshiioffl… pic.twitter.com/MlkmQGfliW— Haarika & Hassine Creations (@haarikahassine) February 1, 2024
గుంటూరు కారం బాక్సాఫీస్ దగ్గర సరైన విధంగా పర్ఫామ్ చేయకపోవడానికి పెద్ద రీజనే ఉంది. ఈ మూవీ ప్రీమియర్స్ రోజునే కొన్ని చోట్ల HD ప్రింట్స్ బయటకు రావడం ఈ సినిమాకు మైనస్‌కు మారింది. అది వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్ల విషయానికొస్తే..ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 120 కోట్ల షేర్.. (రూ. 200 కోట్ల గ్రాస్) వరకు రాబట్టినట్టు సమాచారం. గుంటూరు కారం సినిమా థియేట్రికల్‌గా రూ. 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్డర రూ.15 కోట్లకు అటు ఇటుగా ఆగిపోయింది. రాటోటల్‌గా పండగ సీజన్ ముగిసిన నేపథ్యంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఇపుడు దాదాపు అసాధ్యమే అని చెప్పాలి. ఏది ఏమైనా నెగిటివ్ టాక్‌తో గుంటూరు కారం సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు.
Also Read: IT Slabs: ఉద్యోగులపై జాలి చూపని నిర్మలమ్మ.. పొగడ్తలు తప్ప ఒక్క రూపాయి లాభం లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter.