Mahesh Babu Sankranthi Releases: సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు సినిమాలు.. వాటిలో ఎన్ని హిట్లో తెలుసా

Mahesh Babu: సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయాలని ఎందరో హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలు సంవత్సరమంతా ఎదురుచూసైనా సరే సంక్రాంతికి తమ సినిమాని వదలాలని తెగ ఎదురుచూస్తూ ఉంటారు. మహేష్ బాబు కూడా ఈ కోవలోకే వస్తారు..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2024, 07:00 AM IST
Mahesh Babu Sankranthi Releases: సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు సినిమాలు.. వాటిలో ఎన్ని హిట్లో తెలుసా

Mahesh Babu Sankranthi Hits: సంక్రాంతికి స్కూల్స్, కాలేజస్ సెలవులు ఉండడంతో.. అలానే ఉద్యోగాలు చేసేవారు కూడా తమ ఊర్లకు వెళ్ళడంతో.. ఈ సీజన్ సినిమాలకి బాగా అచ్చి వస్తుంది అనేది అందరి నమ్మకం.  అందులో భాగంగానే సంక్రాంతిని సెంటిమెంట్ గా భావిస్తూ ఎంతోమంది హీరోలు ఈ పండుగకు తమ సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు.
అందులో మహేష్ బాబు కూడా ఒకరు. ఈ సారి సంక్రాంతికి కూడా మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న “గుంటూరు కారం” మూవీతో మన ముందుకి రానున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా మహేష్ బాబు హీరోగా నటించిన ఎన్ని సినిమాలు సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యాయి? అందులో ఎన్ని హిట్స్ అయ్యాయి? ఎన్ని ఫ్లాప్ అయ్యాయి? అనే వివరాలు చూద్దాం..

టక్కరి దొంగ

మహేష్ బాబుకి సంక్రాంతి సీజన్ లో సినిమాలు విడుదల చెయ్యడం మొదలైంది ఈ చిత్రం నుంచే.
మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2002లో సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 16న రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ మూవీ ఏకంగా 5 నంది అవార్డులు గెలుచుకుని ఆ సంక్రాంతికి బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ బాబుతో లిసా రాయ్, బిపాస బసు హీరోయిన్లుగా నటించారు.

ఒక్కడు 

మహేష్ బాబుని ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా మార్చిన చిత్రం ఇది. గుణశేఖర్ దర్శకత్వంలో 2003 సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ 9 కోట్లు అయితే, రిలీజ్ అయ్యాక దాదాపు 39 కోట్లు సంపాదించి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన భూమిక హీరోయిన్ గా నటించింది.

బిజినెస్ మ్యాన్

పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు – పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా “బిజినెస్ మ్యాన్”. 2012 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం 40 కోట్లు బడ్జెట్ తో రాగా, ఫుల్ రన్ ముగిసే సరికి 90 కోట్లు కలెక్షన్లు, 40 కోట్ల షేర్ రాబట్టి 2012లో హైయెస్ట్ గ్రాసింగ్  సినిమాగా నిలిచింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు…

ఈ జనరేషన్ కి మల్టీ స్టారర్ ట్రెండ్ సెట్ చేసిన చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు”. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా నటించిన ఈ సినిమా 2013 సంక్రాంతి పండుగ కానుకగా విడుదలయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ ని తెగ ఆకట్టుకుంది. 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 85 కోట్లు సంపాదించి అలానే 4 నంది అవార్డ్స్ సొంతం  చేసుకొని సూపర్ హిట్ గా నిలిచింది.

1 – నేనొక్కడినే

మహేష్ కెరియర్ లో భారీ ఫ్లాప్ లో ఒకటిగా నిలిచిన చిత్రం నేనొక్కడినే.  సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2014 సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో మహేష్ బాబును సుకుమార్ సరికొత్తగా ప్రజెంట్ చెయ్యాలి అని ప్రయత్నించిన ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.

సరిలేరు నీకెవ్వరు

2022 సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ చిత్రం మహేష్ బాబుకి మంచి విజయం అందించింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని 75 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా.. 260 కోట్ల కలెక్షన్లు, 138 కోట్ల షేర్ కొల్లగొట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

మరి ఈ సంవత్సరం సంక్రాంతికి రాబోతున్న గుంటూరు కారం సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే జనవరి 12 వరకు వేచి చూడాల్సిందే. 

Also read: Sankranthi Holidays 2024: సంక్రాంతి సెలవుల్లో మార్పు చేసిన ఏపీ ప్రభుత్వం, ఎప్పట్నించి ఎప్పటి వరకంటే

Also read: Aadhaar Update: ఆధార్‌లో అడ్రస్, పుట్టినతేదీ మార్చేందుకు ఏమేం అవసరం, ఎలా చేయాలి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News