Tollywood Shootings Bundh: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం.. షూటింగ్స్ బంద్?

Tollywood Producers to stop shootings: నిర్మాతలు టాలీవుడ్ సినీ షూటింగ్స్ బంద్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2022, 01:45 PM IST
  • టాలీవుడ్ షూటింగ్స్ బంద్?

    నిర్మాతల సంచలన నిర్ణయం

    ఈరోజు అధికారిక ప్రకటన చేసే అవకాశం

Tollywood Shootings Bundh: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం.. షూటింగ్స్ బంద్?

Tollywood Producers to stop shootings: టాలీవుడ్ సినీ పరిశ్రమను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వేతనాలు పెంచాలి అంటూ సినీ కార్మికులు రెండు రోజుల పాటు షూటింగ్స్ బంద్ చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు నిర్మాతలు దిగి వచ్చి వేతనాలు పెంచడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈసారి నిర్మాతలు షూటింగ్స్ బంద్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అంతకంతకూ పెరుగుతున్న ప్రొడక్షన్ కాస్ట్ విషయంలో కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో నిర్మాతలు పూర్తిస్థాయిలో సినిమా షూటింగ్స్ నిలిపివేసి స్టార్ హీరోలు, దర్శకులు సహా కార్మికులు కూడా వేతనాలు తగ్గించుకుంటేనే సినిమాలు చేయాలని లేకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు సినిమాలు ఆపివేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక నిర్ణయానికి వచ్చిందని ఒక ప్రచారం జరుగుతుండగా, ఇంకా చర్చలు జరుగుతున్నాయని సోమవారం నుంచి సినిమా షూటింగులు నిలిపివేసే అవకాశం ఉందని మరో ప్రచారం జరుగుతోంది.

సినిమా షూటింగ్​లను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. పారితోషికాలు పెంచడం.. తమకూ కనీస వేతనాలు పెంచాలంటూ జూనియర్​ ఆర్టిస్ట్​లు సమ్మెకు దిగడంతో నిర్మాతల మండలి ఆదివారం నాడు ప్రత్యేకంగా సమావేశం అయింది. మరో రెండు మూడు రోజుల్లో షూటింగ్​ల నిలుపుదలపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధికారిక ప్రకటన కు ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఒక అధికారిక ప్రకటన వెలువడితే కానీ ఒక క్లారిటీ రాకపోవచ్చు. 
 Also Read: Shalini Pandey: బ్లాక్ అవుట్ ఫిట్లో షాలిని పాండే మెరుపులు.. చక్కనమ్మ చిక్కినా అందమే మరి!

Also Read: Rakul Preet Singh: ట్రాన్స్ పరెంట్ డ్రెస్లో రెచ్చిపోయిన రకుల్ ప్రీత్.. మాములు రచ్చ కాదుగా ఇది!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News