Jabardasth Varsha : వారానికి ఒకసారి లేదా రెండు సార్లు.. సీక్రెట్లు బయటపెట్టేసిన జబర్దస్త్ వర్ష

Jabardasth Varsha Beauty Secrets జబర్దస్త్ వర్ష తాజాగా నెటిజన్లతో ముచ్చట్లు పెట్టింది. వర్ష తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ తన హెయిర్ సీక్రెట్లను అడిగింది. కేశాల సంరక్షణ కోసం ఏం చేస్తుంటావ్ అని అడిగారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2023, 09:20 PM IST
  • నెట్టింట్లో జబర్దస్త్ వర్ష సందడి
  • బ్యూటీ సీక్రెట్లను అడిగిన ఫ్యాన్స్
  • అసలు విషయం చెప్పిన వర్ష
Jabardasth Varsha : వారానికి ఒకసారి లేదా రెండు సార్లు.. సీక్రెట్లు బయటపెట్టేసిన జబర్దస్త్ వర్ష

Jabardasth Varsha Beauty Secrets జబర్దస్త్ వర్షకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఆమె తెరపై చేసే కామెడీ, చేసే అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు. ఇక ఇమాన్యుయేల్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టుగా చేసే టీఆర్పీ స్టంట్లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. లవర్స్‌లా నటించమంటే ఈ జంట ఏకంగా జీవించేస్తుంటుంది. వీరి అతి కాస్త ఎక్కువ అవుతూ ఉండటంతో జనాలు దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు.

సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లను తట్టుకోలేక మధ్యలో కొన్ని రోజులు వర్ష ఇమాన్యుయేల్‌లు దూరంగానే ఉంటూ వచ్చారు. స్కిట్లలోనూ అన్నా చెల్లెళ్లుగా నటించారు. అయితే ఇప్పుడు మళ్లీ ప్రేమ పక్షుల్లానే స్కిట్లు వేస్తున్నారు. అలా వర్ష ఇమాన్యుయేల్‌లు జనాలను పిచ్చోళ్లను చేసే ప్రయత్నం చేస్తుంటారు.

ఇక యూట్యూబ్ చానెళ్లలో వర్ష చేసే వింత వీడియోలు ఎలా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. ఇక ఆ వీడియోలో వర్ష, ఇమాన్యుయేల్‌లు చేసే షాపింగ్‌లు, ఆ షాపింగ్‌ సమయంలో వేసే కామెంట్లు ఎక్కువగా ఆకట్టుకుంటాయి. వర్ష కోసం బంగారం కొనిస్తున్నట్టుగా, ప్రేమ బహుమతులు అంటూ ఎంగేజ్మెంట్ షాపింగ్ అంటూ ఇలా నానా రకాలుగా పబ్లిసిటీ స్టంట్లు వేస్తుంటారు.

తాజాగా వర్ష తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఇలా అడిగారు. మీ జుట్టు చాలా ఒత్తుగా ఉంది.. కేశాల కోసం తీసుకునే సంరక్షణ ఏంటి? అని అడిగారు. దీంతో వర్ష తన సీక్రెట్లను చెప్పేసింది. నేను జుట్టు కోసం సింపుల్‌ ట్రిక్‌ను ఫాలో అవుతాను.. వారానికి ఒకసారో రెండు సార్లో ఆయిల్ పట్టిస్తాను.. సీక్రెట్ హెయిర్ ఆయిల్ నుంచి బ్లాక్ చార్మ్ హెయిర్ ఆయిల్‌ను వాడుతాను.. వంద శాతం సహజ పద్దతుల్లో చేసిన ఆయిల్‌ను వాడుతాను అంటూ చెప్పుకొచ్చింది.

Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే

Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News