Jaya Prakash Reddy Passed Away: నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది.‌ ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి(74) కన్నుమూశారు. నేటి తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేలోపే జయప్రకాశ్ రెడ్డి తుదిశ్వాస (Jaya Prakash Reddy Dies) విడిచారు.

Last Updated : Sep 8, 2020, 08:52 AM IST
  • టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది
  • ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత
  • గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయిన జయప్రకాశ్ రెడ్డి
Jaya Prakash Reddy Passed Away: నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి(74) కన్నుమూశారు. నేటి తెల్లవారుజామున గుండెపోటు రావడంతో సీనియర్ నటుడు తుదిశ్వాస విడిచారని (Jaya Prakash Reddy Passed Away) సమాచారం. బాత్రూమ్‌లోనే కుప్పకూలిపోయిన జయప్రకాశ్ రెడ్డిని ఆస్పత్రికి తరలించేలోపే ఆయన (Jaya Prakash Reddy Dies) కన్నుమూశారు. లాక్‌డౌన్, షూటింగ్‌ల రద్దుతో ఆయన గత కొన్ని నెలలుగా గుంటూరులోనే ఉంటున్నారు. జయప్రకాశ్ రెడ్డి మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

1946 మే 8న కర్నూలు జిల్లా సిర్వేల్‌లో జయప్రకాశ్‌రెడ్డి జన్మించారు. 1988లో బ్రహ్మపుత్రుడు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. 1997లో వచ్చిన ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో తనదైన రాయలసీమ మాండలీకం విలనిజంతో ప్రేక్షకులను మెప్పించారు. సమరసింహారెడ్డి తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చివరగా ఈ ఏడాది వచ్చిన మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’లో తెరమీద కనిపించారు.‌ AP Unlock 4 Guidelines: ఏపీలో అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల 

Trending News