Jr Ntr - Allu Arjun: టాలీవుడ్ లో ఇద్దరి యంగ్ హీరోల కలయిక ఇప్పుడు పెద్ద సెన్షన్ గా మారబోతుందా...రెండు పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన ఆ ఇద్దరి స్టార్ లు ఓకే వేదిక పంచుకోవడం వెనుక రీజన్ ఏంటి..సొంతగానే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరి యంగ్ హీరోస్ ఇప్పుడు ఎందుకు కలవాలనకుంటున్నారు...గత కొద్ది రోజులుగా వీళ్లిద్దరికి ఎదురవుతున్న సమస్య ఏంటి..వీళ్లిద్దరినీ కలిసేలా చేసిన ఘటనలు ఏంటి..వీళ్ల కలయిక కేవలం సినిమాలకే పరిమితం అవుతుందా...లేక రాజకీయాల్లో కూడా తమ సత్తా ఏంటో చూపాలనే కలవాలనుకుంటున్నారా...ఇంతకీ ఎవరా యంగ్ హీరోస్ ..ఏంటా కథ..
జూనియర్ ఎన్టీఆర్..టాలీవుడ్ లో తన కంటూ ఓ ప్ర్యతేక ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో. సీనియర్ ఎన్టీఆర్ నట వారసత్వంగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ తో పాటు ఇండియా వైడ్ గా తన కంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ జనరేషన్ హీరోల్లో టాప్ హీరోగా అయ్యే అవకాశాలు ఉన్న హీరో. నినుచూడాలని సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమా సినిమాకు తన నటనతో, డ్యాన్స్ తో ప్రేక్షకులకు అలరించాడు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోల్లో నవరసాలు పండించ గల అతి కొద్ది మంది నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇటీవల వచ్చిన RRR సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో రేంజ్ కు తన ఇమేజ్ ను పెంచుకున్నాడు.
ఇక టాలీవుడ్ లో మరో యంగ్ హీరో అల్లు అర్జున్. మొదట్లో అందరూ స్టైలిష్ స్టార్ గా పిలుచుకునే అల్లు అర్జున్ ప్రస్తుతం అభిమానులకు ఐకాన్ స్టార్ గా మారాడు. తాత అల్లు రామలింగయ్య నటవారసత్వం, మామ మెగస్టార్ అందండలు కలిసి టాలీవుడ్ లోనే టాప్ హీరోగా మారాడు. గంగోత్రి సినిమాతో చిత్రి పరిశ్రమకు పరిచయం ఐన అల్లు అర్జున్ క్రమక్రమంగా తన నటతో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ను సృష్టించుకున్నారు. టాలీవుడ్ తో పాటు సమానంగా కేరళలో కూడా తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను అల్లు అర్జున్ ఏర్పర్చుకున్నారు. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అంతే కాదు పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన గుర్తింపు పొందిన యువ హీరోగా రికార్డు కూడా సృష్టించారు.
ఇలా ఇద్దరు యువ హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ఈ ఇద్దరి హీరోలకు ఇప్పుడు ఒకే తరహా సమస్య వచ్చి పడింది. తమ బ్యాక్ గ్రౌండ్ గా చెప్పుకునే ఫ్యామిలీనే వారిని దూరం పెట్టారనే గుసగుసలు చిత్ర పరిశ్రమలో జోరందుకున్నాయి. దీనిని బలపరిచేలా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కూడా దానిని బలపరుస్తున్నాయి. ఇటీవల నందమూరి హీరో బాలకృష్ణ 50వసంతాల సినీ ప్రస్థానం పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమానికి ఈ ఇద్దరూ దూరంగా ఉన్నారు. ఐతే ఈ ఇద్దరు దూరంగా ఉండడానికి కారణం ఫ్యామిలీస్ తో ఉన్న గ్యాప్ అనేది ప్రచారంలో ఉంది. సిని పరిశ్రమలో ఉన్న అందరినీ ఆహ్వానించిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం పిలవలేదు. అంతే కాదుజూనియర్ ఎన్టీఆర్ ను పిలవవద్దని స్వయాన బాలకృష్ణే చెప్పారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరగడం సంచలనంగా మారింది. మరోవైపు అల్లు అర్జున్ కు కూడా ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్ అందలేదు. దీనిపై కూడా రకరకాల ప్రచారాలు ఉన్నాయి. అయితే వాటిలో మాత్రం అల్లు అర్జున్ ను పిలవడం తనకు ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు టాలీవడ్ లో టాక్. ఇలా ఇద్దరు బాలకృష్ణ ప్రోగ్రాంకు దూరంగా ఉండిపోయారు.
దీనికి గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలే కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా రాజకీయపరమైనయ విభేధాలే ఇటు జూనియర్ ఎన్టీఆర్ ను అటు అల్లు అర్జున్ ను తమ స్టార్ ఫ్యామిలీ నుంచి దూరం జరిగిలే చేశాయనే చర్చ ఉంది. చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకీ దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతే కాదు హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్ కు చాలా గ్యాప్ వచ్చింది. నందమూరి కుటుంబానికి చెందిన ముఖ్యమైన కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు.అది ఆ కుటుంబం నుంచి ఆహ్వానం లేకనా మరీ జూనియర్ కు ఇష్టం లేకనా తెలియదు కానీ కొంత ఆ కుటుంబానికి ఎన్టీఆర్ కు గ్యాప్ వచ్చిన మాటా మాత్రం నిజం. ఇదే సందర్భంలో ఏపీ ఎన్నికలు రావడం ఎన్నికల ప్రచారానికి జూ. ఎన్టీఆర్ దూరంగా ఉండడం కూడా జరిగింది. అదే సమయంలో జూ. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు ఐన కొడాలి నాని లాంటి వారు టీడీపీ ప్రత్యర్థి పార్టీ వైసీపీ నుంచి పోటీలో ఉండడం కూడా బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబానికి రుచించలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కుటుంబానికి తెలియకుండానే ఓ పెద్ద అగాధం ఏర్పడింది. ఇది మొత్తానికి జూనియర్ నే నందమూరి కుటుంబానికి దూరం పెట్టేలా చేసింది.
ఇక అల్లు అర్జున్ దీ కూడా ఇదే తరహా కథ. కానీ మెగా ఫ్యామిలీలోనే తన కంటూఒక ఓన్ ఇమేజ్ ను బిల్డప్ చేసుకున్న అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌తో ఏర్పడిన గ్యాప్ తో ఆ ఫ్యామిలీకే దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కు ఎప్పటి నుంచో కొంచెం గ్యాప్ ఉండేది. దీనిపై ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకునే వారు. అలాంటి వారి మధ్య మొన్నటి ఎన్నికలు మరింత చిచ్చును రేపాయి. టీడీపీ, జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి దిగితే అల్లు అర్జున్ మాత్రం తనకు కావాల్సిన మిత్రుడు ఐన వైసీపీ అభ్యర్థి తరుపున ప్రచారం చేయడం పెద్ద దుమారాన్నే లేపింది. దీంతో ఒక రకంగా అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల నాటి నుంచి నేటి వరకు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవతుంది. దీంతో ఈ ఇద్దరు హీరోల మధ్య మెగా ఫ్యామిలీలోనే తీవ్ర సమస్య ఏర్పడింది. మొత్తం మెగా ఫ్యామిలీ అంతా పవన్ వైపు నిలవడంతో అల్లు అర్జున్ ఒంటరయ్యారు. దీంతో మెగా కంపౌండ్ కు దూరం అయ్యారనే ప్రచారం ఉంది.
అయితే ఇప్పుడు అదే ఇద్దరు హీరోలు కలిసి ఒకే వేదిక పంచుకోవడంపై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ జరగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర్ సినిమా ప్రమోషన్ కు పెద్ద ఎత్తున ఆ సినిమా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కు ఐకానిక్ స్టార్ హాజరవుతున్నారని తెలియడంతో ఈ ఇద్దరి హీరోల అభిమానులు థ్రిల్ అవుతున్నారు. తమ అభిమాన హీరోలను సైడ్ చేద్దామనకున్న వాళ్లకు ఈ ఇద్దరు కలవడంపై తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి ఒకే వేదికను పంచుకోవాలనుకోవడమే తమకు పెద్ద సర్ ప్రైజ్ గా ఉందని ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ చెబుతున్నారు. ఐతే ఎందుకు వీళ్లు ఇలా ప్లాన్ చేశారా అని సిని పరిశ్రమలో చర్చ జరుగుతుంది. యాధృశ్చికంగానే దేవర సినిమాకు అల్లు అర్జున్ పిలిచారా లేక ఇంకా ఏదైనా ఇతరత్రా కారణం ఉందా అని సిని పరిశ్రమకు చెందిన వారు ఆరా తీస్తున్నారు. ఇటీవలే ఈ ఇద్దరిని నటసింహ బాలకృష్ణ ప్రోగ్రాంకు ఆహ్వానించలేదు. దీంతో ఇద్దరు ఇప్పుడు సినిమా ప్రమోషన్ లో కలుసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇద్దరు కలిసి తమ అభిమానులకు ఏవిధమైన మెసేజ్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
గతంలో వీరికి జరిగిన అనుభవాల దృష్ట్యా వీరిద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని డిసైడ్ అవుతున్నారా అనే చర్చ టాలీవుడ్ లో ఉంది. అసలే ఈ ఇద్దరి యంగ్ హీరోలకు పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వీరిద్దరు కలవడంపై కూడా ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్మ గా ఉన్నారు.. అయితే ఇది కేవలం దేవర సినిమా ప్రమోషన్ కు మాత్రమే పరిమితం అవుతుందా లేక ఫ్యూచర్ లో కూడా కొనసాగుతుందా చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఒంటరైన ఈ ఇద్దరు హీరోలు కలిసి ఏం మాట్లాడుతారనేది కూడా ఆసక్తి నెలకొంది. ఉన్నట్లుండి ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒకే వేదికను పంచుకోవడం యాధృశ్చికంగా జరిగిందా లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా అన్న చర్చ కూడా బలంగా ఉంది. సినిమా పరిశ్రమలో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకనేలా ఈ వేదిక మారనుందనేది ఒక టాక్. అంతే కాదు తమపై కౌంటర్లు వేసేవారికి ఇప్పుడు ఒకటిగా నిలబడి తమ సత్తా ఏంటో చెప్పాలన్నదే ఆ హీరోల ఆలోచన కావొచ్చనేది మరో టాక్.
ఇలా ఏది ఏమైనా ఇద్దరు యంగ్ హీరోలు అందునా బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఇప్పుడు ఒకే వేదిక పంచుకోవడం మాత్రం పెద్ద విషయమే. ఐతే ఈ కలయిక ద్వారా వాళ్లు ఏం చెబుతారనేది మాత్రం సస్పెన్స్. దేవర ప్రమోషన్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త సమీకరణాలు ఏర్పడుతాయా అనేది మాత్రం వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.