Ghost Music Rights : శివ రాజ్‌కుమార్ ఘోస్ట్ మ్యూజిక్ రైట్స్.. ఫిబ్రవరిలో షూటింగ్ ఖతం

Ghost Music Rights కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఘోస్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఘోస్ట్ ఆడియో హక్కులను ఆనంది ఆడియో సంస్థ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి కానుందని తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2023, 05:38 PM IST
  • కన్నడ స్టార్ కొత్త సినిమా అప్డేట్
  • శివ రాజ్ కుమార్ ఘోస్ట్ మూవీ
  • ఘోస్ట్ మ్యూజిక్ రైట్స్ అప్డేట్
Ghost Music Rights : శివ రాజ్‌కుమార్ ఘోస్ట్ మ్యూజిక్ రైట్స్.. ఫిబ్రవరిలో షూటింగ్ ఖతం

Ghost Music Rights కన్నడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి హీరో నుంచి హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఘోస్ట్ అనే సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియన్‌గా రిలీజ్ చేస్తున్నారు. బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించిన దర్శకుడు శ్రీని ఘోస్ట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీన ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ఈ సినిమాను నిర్మిస్తున్నారుడు. 

కొత్త ఏడాది సందర్భంగా ఈ టీం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రెట్రో మోషన్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి ఆదరణ దక్కింది. వింటెజ్ శివ రాజ్ కుమార్ స్టిల్‌లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్ ఘోస్ట్ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో రానుందట. 

ఘోస్ట్  మూవీ రెండో షెడ్యూల్ ఇటీవలే మైసూర్‌లో కంప్లీట్ అయింది. మూడో షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో జరగనుందట. బెంగళూరులో వేసిన మరో భారీ సెట్ ఈ షెడ్యుల్‌లో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సన్నివేశాలతో పాటూ నాలుగు యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేయబోతోన్నారట. అలా మొత్తంగా ఫిబ్రవరి నెలలోనే షూటింగ్ పూర్తి కానుందట.

తాజాగా ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ గురించి అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఆడియో కంపెనీ ఆనంద్ ఆడియో ఘోస్ట్ మ్యూజిక్ రైట్స్‌ను రికార్డ్ ప్రైస్‌కి కైవసం చేసుకుందని తెలుస్తోంది. అన్నీ భాషల ఆడియో హక్కులను భారీ రేటుకు ఆనంద్ ఆడియో సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్

Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News