Karthika Deepam 2 Today January 6 Episode: ఇడ్లీ బండి పెట్టుకోమన్న పెళ్లాం మాట నచ్చిందా అంటాడు శ్రీధర్. ఎప్పుడైనా సరదాగా పెళ్లి, ఫంక్షన్‌కు వెళితే శివన్నారాయణ కుటుంబం అని గౌరవం ఇచ్చేవారు. మన కుటుంబం సొసైటీలో ఓ ఎత్తైన శిఖరంలా అనిపించేది. తమరి రెండో పెళ్లితో ఆ శిఖరం నేలపై పడింది అంటాడు కార్తీక్. గతాన్ని మార్చలేకపోవచ్చు. కానీ,భవిష్యత్తు గతాన్ని మారుస్తుంది అంటాడు. హ.. ఆ దీపతో ఉన్నంత కాలం సర్వనాశనమై పోతాడు అంటాడు. దీంతో కార్తీక్‌కు కోపం వస్తుంది అనసవరంగా మాట్లాడి ఉన్న మర్యాద పోగొట్టుకోకు అంటాడు.
సరేరా నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి ఓ ఆఫర్ ఇస్తున్నా అంటాడు. నీకు భార్య ఆస్తి కలిసి వచ్చింది కాబట్టి ఎన్ని కబుర్లు అయిన చెబుతావు. ఇన్నాళ్లు తిరిగిన కారు నాసంపాదన కాదు, కానీ, ఈ సైకిల్ నాది తప్పుకో అని వెళ్లిపోతాడు కార్తీక్. పోరా ఈ రెండు చక్రాలు పోయేవరకు నీకు కథ అర్థం కాదు అంటాడు శ్రీధర్.
మరోవైపు దీపను చూడటానికి సుమిత్రమ్మ దాసుతో కలిసి ఆటోలో వస్తుంది. టిఫిన్ బండి వద్ద ఉన్న దీపను బాధతో చూస్తుంటుంది. అక్కడ కాంచనను కూడా చూస్తుంది. కార్తీక్ ఉంటున్న ఇల్లు అదేనమ్మ ఇంటి ముదే టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు అని దాసు చెబుతాడు. ఎలా బతికిన మనిషి ఎలా బతుకుతుంది అని కాంచనను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మనసులో దాసు నీయావదాస్తికి ఒకే ఒక వారసురాలు ఎలా బతుకుతుంది. మా వదిన్ని మాత్రమే కాదు దీపను చూసిన గుండె తరుక్కుతుంది.
దాని చేతికి పదిమందికి పెట్టే గుణం ఉంది. తన మనస్సులో పది మంది కావాలనే ఆరాటం ఉంది. కార్తీక్ పెళ్లి చేసుకున్నాడు దీప కష్టాలు పోయాయి అనుకున్నా అని ఏడుస్తుంది సుమిత్రమ్మ. అప్పుడు దాసు లేదమ్మ లేదు దీప ఇలా ఉండకూడదు అంటాడు దాసు. దీప అమ్మనాన్న చనిపోలేదమ్మ బతికే ఉన్నారు అని చెప్పబోతాడు దాసు. అంటే దీప ఇన్నాళ్లు అబద్దం చెప్పిందా అంటుంది సుమిత్రమ్మ. అంటే.. భౌతికంగా వాళ్లు చనిపోయిన వాళ్ల ఆశీర్వాదాలు ఉంటాయి.
దీపను చూస్తూ వాళ్ల కన్నతల్లి కూడా ఇలాగే బాధపడుతుండవచ్చు కదా అంటాడు. అవును దీపను ఏనాడు నేను దీపను పరాయిది అనుకోలేదు, నా కూతురులా చూశా. నా ప్రాణాన్ని కాపాడిన కృతజ్ఞత మాత్రమే కాదు అంతకు మించిన బంధం ఉన్నట్లు అనిపిస్తుంది అని దాసుతో సుమిత్రమ్మ చెబుతంఉది. ఇక్కడ ఉండటం నాకు నచ్చలేదు వెళ్లిపోదాం పదా అంటుంది. మళ్లీ దాసు.. దీప చేతి వంట తినాలని ఉంది అంటుంది.
నీ కూతురు చేతివంట నువ్వు తినడంలో భాగ్యం ఏముంది అంటాడు, కార్తీక్ ఏడి అంటుంది సరుకులు తీసుకు రావడానికి వెళ్లినట్లున్నాడు అంటాడు. మన దీపకు భర్త అంటే ఎంత ఇష్టం, మావయ్య పడగొట్టిన పేరు దీప నిలబెట్టింది అంటుంది సుమిత్రమ్మ. ఇక డ్రైవర్ దీప చేసిన టిఫిన్స్ తెచ్చి ఇస్తాడు. వాసన చూస్తుంటే ఆకలి గుర్తుకు వస్తుంది అంటుంది సుమిత్రమ్మ. అప్పుడే కార్తీక్ ఆలస్యం ఎందుకు తినేయ్ అత్త అంటాడు.
ఇదీ చదవండి: కావ్యరాజ్‌లకు అనామిక కోలుకోలేని దెబ్బ.. బంగారు కిరీటం రాత్రికి రాత్రే మాయం..
ఇప్పుడు ఏం జరిగిందని అత్త ఈ కన్నీళ్లు అంటాడు. ఎలా రా? అన్నీ వదులుకుని ఇంత సాధారణంగా ఎలా బతుకుతున్నారు అంటుంది సుమిత్ర. అదిగో దీపంలా వెలిగిపోతున్న ఆ మనిషి వల్ల అంటాడు కార్తీక్. ఇది నా కష్టకాలమే చికట్లో కూడా దారి చూపే దేవతలా నా భార్య నాతో ఉంది. మనిషి అన్నాడో ఎప్పుడు ఆలోచించాల్సింది పోగొట్టుకున్న దానిగురించి కాదు తనవద్ద ఉన్నదానిగురించి ఆలోచించాలి.
భార్య,తల్లి, కూతురు వీరు సరిపోరా నేను సాధించడానికి అంటాడు కార్తీక్. అవన్నీ జరుగుతాయి లే అత్త వచ్చి అమ్మను దీపను పలకరించాల్సింది అంటాడు. నేను వచ్చి మిమ్మల్ని ఆపాల్సింది అని ఏడుస్తుంది. తాతయ్య తెలిస్తే నిన్ను కూడా బయటకు గెంటేస్తాడు అంటాడు కార్తీక్. అత్త ఆ ఇంటికి నువ్వే అందం అని మాట్లాడుతుంటాడు.
దీప దూరం నుంచి గమనిస్తుంది. మిమ్మల్ని ఎప్పుడురా కలిసేది అంటుంది. అప్పుడే దీపను చట్నీ వేయమని పిలుస్తారు. అటు వెళ్లిపోతుంది దీప. మా గురించి బెంగ పెట్టుకోకు అంటాడు. చంటిది ఏది అంటుంది సుమిత్ర స్కూళ్లో డ్రాప్ చేసి వచ్చా అంటాడు కార్తీక్. ఉంటాను రా వెళ్తా అంటుంది సుమిత్ర. బాబాయ్ ఖాళీ ఉన్నప్పుడు వస్తూ ఉండండి అని దాసుకు చెబుతాడు కార్తీక్.
ఇదీ చదవండి: భర్తతో థాయిలాండ్‌లో చిల్ అవుతున్న కీర్తి సురేష్.. మహానటి రచ్చ మాములుగా లేదుగా, ఫోటోస్ వైరల్..
ఎవరితో రా.. అక్కడ నిలబడి అంతసేపు మాట్లాడతావు అంటుంది కాంచన. రమ్మిని పిలవచ్చు కదా అంటుంది. తీసుకెళ్లారులే అంటాడు కార్తీక్. మరోవైపు టిఫిన్ తీసుకెళ్తుంది సుమిత్ర. ఇంట్లో అందరికీ పెడుతుంది. టిపిన్ రుచి చూసి ఇవాళ టిఫిన్స్ చాలా టేస్టీగా ఉన్నాయి అంటాడు దశరథ, అవునరా అంటాడు శివన్నారాయణ. మనింట్లో ఎప్పుడు ఈ టేస్ట్ రాలేదు. మన రెస్టారెంట్‌లో టిఫిన్స్ ఓకే కాదు చట్నీ నాట్ ఓకే అంటుంది జో.. ఏమంటావు తాతా అంటుంది. ఎస్, కోడలు ఈరోజు టేస్ట్ బాగా చేసింది అంటాడు శివన్నారాయణ.
అంటే ఈ టిఫిన్స్ మీ అందరికీ నచ్చినట్లేనా అంటుంది సుమిత్ర. రెస్టారెంట్‌లో కూడా ఈ టేస్ట్ ఉండట్లేదు మమ్మి అంటుంది జో. రోడ్డు పక్కన బండ్లపై ఇలా టేస్టీగా ఉంటుందని మీరు నమ్ముతారా? అంటుంది. అలాచేస్తే తీసుకువచ్చి రెస్టారెంట్ లో పెట్టుకోవచ్చు అంటుంది. ఫ్రాంచైజీ కూడా ఇవ్వచ్చు అంటుంది జో. మరి ఈ టిఫిన్ చేసింది ఎవరనుకున్నారు దీప అంటుంది సుమిత్ర.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి