Middle class melodies: ఓటీటీతో బంపర్ హిట్ కొట్టిన మిడిల్ క్లాస్ మెలోడీస్

మధ్య తరగతి జీవన చిత్రాల ఆధారంగా తీసిన ఆ సినిమా సూపర్ హిట్ కొట్టేసింది. రెండేళ్ల క్రితం వరకూ సాదాసీదా కుర్రోడిప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఘనత అది..

Last Updated : Nov 23, 2020, 11:56 AM IST
  • తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఓటీటీ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్
  • దర్శకుడు కావాలన్న కోరికను తొలి సినిమాతో సాధించుకున్న వినోద్ అనంతోజు
  • మధ్య తరగతి జీవితాలే ఇతివృత్తంగా మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా
Middle class melodies: ఓటీటీతో బంపర్ హిట్ కొట్టిన మిడిల్ క్లాస్ మెలోడీస్

మధ్య తరగతి జీవన చిత్రాల ఆధారంగా తీసిన ఆ సినిమా సూపర్ హిట్ కొట్టేసింది. రెండేళ్ల క్రితం వరకూ సాదాసీదా కుర్రోడిప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఘనత అది..

ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ ( OTT Platform )లో విడుదలైన  మిడిల్ క్లాస్ మెలోడీస్ దర్శకుడు ఈ గుంటూరు కుర్రోడు. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన వినోద్ అనంతోజు ( Vinod Ananthoju )..దర్శకుడు కావాలన్న కలను తొలి సినిమాతోనే సాధించేసుకున్నాడు. మధ్య తరగతి ప్రజల జీవన చిత్రాల ఆధారంగా నిర్మించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. 

సినిమాలపై మక్కువతో..కాలేజి రోజుల్లోనే షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. దాదాపు 8 షార్ట్ ఫిలిమ్స్ ( Short films ) లో శూన్యం చిత్రానికి పేరొచ్చింది. సినిమా తీయాలనుకునేవాడు  ఎలాంటి కధను ఎంచుకుంటాడు..సమాజంలో కధ ఎలా ఉపయోగపడుతుందనేది శూన్యంలో ఇతివృత్తం. ఇప్పుడు మిడిల్ క్లాస్ మెలోడీస్ కధను కూడా ఇలాగే మధ్య తరగతి జీవితాల ఇతివృత్తంగా తీశాడు. తన లాంటి మధ్యతరగతి జీవితాలను వినోదాత్మకంగా తెరకెక్కించి, వీక్షకులను మెప్పించాడు. సుప్రసిద్ధ దర్శకుల అభినందనలూ అందుకున్నాడు.  

హీరో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా, కన్నడ నటి వర్ష  ( Kannada Actress Varsha ) బొల్లమ్మ హీరోయిన్ గా తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం గుంటూరు, తెనాలి సమీపంలోనే జరిగింది. క్యారెక్టర్ నటుల్ని ఎక్కువగా డ్రామా ఆర్టిస్టుల్నే తీసుకున్నాడు. 

2019 జూన్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కాగా..ఆరు నెలల్లో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం చేసే సమయానికి లాక్ డౌన్ తో ధియేటర్లు మూతపడ్డాయి. అమెజాన్ ( Amazon prime )ను సంప్రదించగా..వారికి నచ్చి తీసుకున్నారు. సినిమా ఇంతలా హిట్ కొడుతుందని ఊహించలేదని..దర్శకుడు క్రిష్ ( Director Krish ) కూాడా ఫోన్ లో అభినందించారని ఆనందపడుతున్నారు వినోద్ అనంతోజు. Also read: Sarkaru Vaari Paata: సర్కారు వారిపాటపై కరోనా ప్రభావం?

Trending News