Movies Releasing in Theaters: ఈ వారం థియేటర్లలో ఏకంగా 11 సినిమాలు.. ఓటీటీలో ఏమేం సినిమాలు వస్తున్నాయంటే?

Movies Releasing in Theaters this Week: ఈ వారం పెద్ద ఎత్తున థియేటర్లలో సినిమాలు విడుదలవుతున్నాయి. ఏకంగా ఈసారి 11 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అని అంటున్నారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 31, 2022, 12:52 PM IST
Movies Releasing in Theaters: ఈ వారం థియేటర్లలో ఏకంగా 11 సినిమాలు.. ఓటీటీలో ఏమేం సినిమాలు వస్తున్నాయంటే?

Movies Releasing in Theaters and OTT this Week: షూట్ పూర్తి చేసుకున్న అన్ని పెద్ద సినిమాలు విడుదలయిపోగా ఇప్పుడు మిగిలిన చిన్న సినిమాలు విడుదలకు సిద్దమవుతూ ఉండగా ఈ వారం పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నవంబర్ 4న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏమేం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే విషయాల్లోకి వెళితే పేపర్ బాయ్, ఏక్ మినీ కథ ఫేమ్ హీరో సంతోష్ శోభన్, జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ విడుదలవుతోంది.

డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమాలో బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి కీలకపాత్రల్లో నటించిగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఇక అదే రోజున అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో కూడా రిలీజ్ అవుతోంది. డైరెక్టర్ రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అచ్చు రాజమణి సంగీతం అందించారు. అలాగే గీతా మాధురి భర్త నందు, జబర్దస్త్ ఫేమ్ రష్మి జంటగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ కూడా అదే రోజున రిలీజ్ అవుతుంది.

ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాకు రాజ్ విరాట్ దర్శకత్వం అందించగా  ప్రశాంత్ విహారి సంగీతం అందించారు. అలాగే ఇవి కాక తమిళ డబ్బింగ్ ఆకాశం సినిమా, మిస్టర్ తారక్ అనే సినిమా, చక్కటి మిస్టీరియస్ లవ్ స్టోరీ, తగ్గేదే లే, జెట్టి, సారధి, బనారస్, మిలి అనే సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఒక్కరోజులో ఏకంగా 11 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు కూడా గట్టిగానే ఉన్నాయి.

ముందుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బ్రహ్మాస్త్ర సినిమా నవంబర్ 4న స్ట్రీమింగ్ కానుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 4న పొన్నియిన్ సెల్వన్, అదే విధంగా మై పోలీస్ మ్యాన్ అనే సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 4న ది ఘోస్ట్, ఇన్ సైడ్ మ్యాన్ అనే సినిమాలో విడుదల కానున్నాయి. ఇక ఆహాలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎపిసోడ్ 3 అంటే అడివి శేష్, శర్వానంద్ ల ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. 

Also Read: Adipurush Out: అనుకున్నంతా అయ్యింది.. చిరు, బాలయ్యలకు సైడ్ ఇస్తూ ఆదిపురుష్ అవుట్!

Also Read: Chiranjeevi Dominates Balakrishna: మాట నెగ్గించుకున్న చిరు.. బాలయ్య సినిమా కంటే ముందే ప్రేక్షకుల ముందుకు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News