Hello Meera Movie : సింగిల్ కారెక్టర్‌తో 'హలో మీరా'.. వీడియో సాంగ్‌లో గార్గేయి ఎమోషనల్

Gargeyi Hello Meera Movie గార్గేయి హలో మీరా అంటూ తన రెండో సినిమాతో సందడి చేసేందుకు వస్తోంది. ఆమె నటించిన ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాకు మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె హలో మీరా అనే సినిమాతో రాబోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2023, 08:59 PM IST
  • హలో మీరా నుంచి వీడియో సాంగ్
  • సింగిల్ కారెక్టర్‌తో సినిమా
  • పాటలో గార్గేయి ఎమోషనల్
Hello Meera Movie : సింగిల్ కారెక్టర్‌తో 'హలో మీరా'.. వీడియో సాంగ్‌లో గార్గేయి ఎమోషనల్

Gargeyi Hello Meera Movie సినిమాలో ఇన్ని కారెక్టర్లు ఉండాలనే నియమం ఏమీ ఉండదు. భారీ తారాగణంతో సినిమాలు తీయొచ్చు. ఓ పది మంది ఆర్టిస్టులతోనూ సినిమా తీయొచ్చు. కానీ ఒకే ఒక్క మనిషిని చూపించి సినిమా తీయడం, ఒకే కారెక్టర్‌తో సినిమాను తీయడం అంటే మామూలుగా విషయం కాదు. కానీ ఇప్పుడు గార్గేయి అలాంటి ఓ ప్రయోగాత్మక సినిమాలోనే నటించింది.

ప్రముఖ దర్శకులు బాపుతో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన కాకర్ల శ్రీనివాసు 'హలో మీరా' సినిమాతో ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. సింగిల్ కారెక్టర్‌తో సినిమాను ఎలా తీసి ఉంటారు అని జనాలు సైతం ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. 

తాజాగా ఈ మూవీ నుంచి నా కనులలో నా కలలలో అంటూ సాగే ఎమోషనల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎస్ చిన్నా అందించిన బాణీ , శ్రీ సాయి కిరణ్ రాసిన సాహిత్యం, సమీర భరద్వాజ్ గాత్రం ఈ పాటను ఎంతో వినసొంపుగా చేశాయి. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో ఈ ప్రయోగాత్మక  చిత్రాన్ని నిర్మించారు. సూరి సాధనాల అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News