SIR Movie Free Show : 'సార్' కోసం విద్యార్థుల ధర్నా.. స్పందించిన నిర్మాత నాగవంశీ

Naga Vamsi Reacts on Student Protest నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆయన తాజాగా కొందరు విద్యార్థులు చేస్తోన్న ధర్నా మీద స్పందించాడు. సార్ సినిమాను ఉచితంగా చూపించేందుకు ముందుకు వచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2023, 05:16 PM IST
  • సార్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
  • ఉచితంగా ప్రదర్శించాలంటూ డిమాండ్
  • దిగొచ్చిన నిర్మాత నాగవంశీ
SIR Movie Free Show : 'సార్' కోసం విద్యార్థుల ధర్నా.. స్పందించిన నిర్మాత నాగవంశీ

Student Demands Free Show For SIR ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ సినిమా ఎంతటి సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. చదువుల గొప్పదనం, కార్పోరేట్ సంస్థల తీరు, ప్రభుత్వ విధానాల మీద విమర్శలు సంధిస్తూ తెరకెక్కించిన సార్ అందరినీ కదిలిస్తోంది. గత ఇరవై ఏళ్ల క్రితం నాటి పరిస్థితులను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమా ప్రతీ ఒక్క ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుంది.

చదువుల కోసం మధ్య తరగతి వాళ్లు పడే కష్టాలను, చదువు పేద వారికి ఎందుకు దూరం అవుతోంది అని చెప్పేందుకు దర్శకుడు రాసుకున్న కథ, కథనం అందరినీ మెప్పిస్తుంది. డబ్బు ఎలాగైనా సంపాదించొచ్చు కానీ మర్యాద మాత్రం చదువుతోనే సంపాదించుకోవచ్చు అంటూ రాసుకున్న డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. 

ఇక ధనుష్‌ నటన ఈ సినిమాకు హైలెట్. మాస్ ఇమేజ్ ఉన్న ఓ హీరో ఇలాంటి మెసెజ్ ఓరియెంటెడ్ చిత్రం, నాన్ కమర్షియల్ సినిమాల్లో నటించడం ఒకెత్తు. ప్రేక్షకులు మెచ్చేలా నటించడం మరో ఎత్తు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను తమకు ఉచితంగా చూపించాలని విద్యార్థులు రోడ్డెక్కేశారు.

 

ఉచితంగా సినిమా చూపించాలని విద్యార్థులు ఆందోళన చేస్తోన్న వీడియో నిర్మాత నాగవంశీ కంట్లో పడింది. దీంతో ఆయన వెంటనే స్పందించాడు. సార్ సినిమాను తీసిందే.. చదువు విలువ తెలియాలని.. స్కూల్ పిల్లలు ఇలా ఫ్రీగా చూపించండని అడుగుతుంటుంటే ఆనందంగా ఉంది.. మీ వివరాలు పంపించండి.. నేను మీకు ఉచితంగా షోను వేసేలా చూస్తాను అని ట్వీట్ వేశాడు.

ఈ సినిమాను ముందుగా తెలుగులో చాలా మంది హీరోలకు వినిపించాడు. కానీ ఏ ఒక్కరూ కూడా ఓకే చెప్పలేదట. దీంతో ధనుష్ హీరోగా ఫిక్స్ చేసుకున్నారు. వెంకీ అట్లూరికి చాలా కాలం తరువాత మళ్లీ హిట్ పడ్డట్టు అయింది. మన తెలుగు దర్శకుడు తమిళ హీరోతో హిట్ కొట్టేడంతో కోలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది.

Also Read:  Priyadarshi Balagam : బలగం ఆమెకే అంకితం.. అమ్మ కాదు అత్తమ్మ.. ప్రియదర్శి ఎమోషనల్ పోస్ట్

Also Read: Urfi Javed Video : బ్యాక్ చూస్తే ఫ్రీ షో.. ఫ్రంట్ చూస్తే మైండ్ బ్లాక్.. ఊరిస్తోన్న ఉర్ఫీ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News