Nani:‘సరిపోదా శనివారం’ మూవీతో నాని ఖాతాలో మరో రికార్డ్..

Nani: నాచురల్ స్టార్ నాని తెలుగులో మీడియం రేంజ్ హీరోల్లో అగ్ర కథానాయకుడిగా సత్తా చూపిస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమాతో పలకరించాడు. తాజాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడంతో పాటు నాని ఖాతాలో మరో రికార్డును నమోదు చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 9, 2024, 12:01 PM IST
Nani:‘సరిపోదా శనివారం’ మూవీతో నాని ఖాతాలో మరో  రికార్డ్..

Nani: నాచురల్ స్టార్ నాని వరుస హిట్లతో దూకుడు మీదున్నాడు. గతేడాది ‘దసరా’తో తన కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా టోటల్ రన్ లో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించి సంచలనం రేపింది. ఈ సినిమా తర్వాత కొత్త దర్శకుడుతో చేసిన ‘హాయ్ నాన్న’ వంటి క్లాస్ మూవీతో మరో హిట్ అను అందుకున్నాడు. తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో మంచి వసూళ్లనే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకపోయినా.. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ భారత్ లో ఈ సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మరోవైపు హిందీ వెర్షన్ లో ఈ సినిమా సోదిలో లేకుండా పోయింది.

మొత్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ. 46 కోట్ల షేర్ (రూ. 83 కోట్ల ) గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో మీడియం రేంజ్ హీరోల్లో రూ. 40 కోట్లకు పైగా షేర్ 4 సార్లు రాబట్టిన ఏకైక హీరోగా నిలిచాడు. బడా స్టార్ హీరోలకు రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్ కామన్ ఎలా అయిందో .. మీడియం రేంజ్ హీరోలకు రూ. 40 కోట్ల క్లబ్ అనేది పెద్ద టార్గెటే అని చెప్పాలి. గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈగ’, ‘MCA’ , దసరా సినిమాల తర్వాత సరిపోదా శనివారం సినిమా రూ. 40 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా నాని కెరీర్ లో నాల్గవ రూ. 40 కోట్ల షేర్ సినిమాగా ‘సరిపోదా శనివారం’ సినిమా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు ఓవర్సీస్ లో ఈ సినిమా $2.4 మిలియన్ డాలర్స్ రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల ఈ సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది. లేకపోయి ఉంటే రూ. 50 కోట్ల క్లబ్బులో ఈ సినిమా చేరి ఉండేది. మొత్తంగా చూసుకుంటే నాని కెరీర్ ‘సరిపోదా శనివారం’ సినిమా మరో హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్లకు గాను రూ. 27 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ కంటే రూ. 4 కోట్ల థియేట్రికల్ లాభాలను అందుకుంది.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News