Nani Remuneration నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కరోనా సమయంలోనూ రెండు సినిమాలను ఇచ్చాడు. ఓటీటీలో వచ్చిన ఆ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. ఇక థియేటర్లో శ్యామ్ సింఘ రాయ్ విడుదల చేశాడు. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం అనుకున్నంతగా రాలేదు. హై బడ్జెట్ కారణంగా సినిమాకు అంతగా లాభాలు రానట్టు తెలుస్తోంది. అంటే సుందరానికీ సినిమా అయితే థియేటర్లో ఆడలేదు.
అలా నాని సినిమాలు మిక్స్డ్ రిజల్ట్‌ను ఇచ్చాయి. అయినా కూడా నాని మాత్రం తన రెమ్యూనరేషన్‌ను పెంచుకుంటూ ఉంటున్నాడు. దసరా సినిమాకు దాదాపు పదిహేను కోట్లు తీసుకుంటున్నాడట. అసలే ఇది పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ ప్రమోషన్స్‌లో నాని, కీర్తి సురేష్‌లు ఫుల్ బిజీగానే ఉంటున్నారు.
నాని ఇప్పుడు తన రెమ్యూనరేషన్‌ను మరింతగా పెంచినట్ట తెలుస్తోంది. నాని తదుపరి మృణాల్ ఠాకూర్‌తో కలిసి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ రొమాంటిక్ సినిమా కోసం నాని దగ్గరదగ్గరగా 22 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం అందుతోంది. ఇలా నాని మాత్రం తన రెమ్యూనరేషన్‌ను భారీగానే పెంచేసుకుంటున్నాడని టాక్.
నాని ఈ దసరా సినిమాతో భారీ హిట్టు కొడితే తన మార్కెట్, స్పాన్ అంతా కూడా పెరుగుతుంది. పుష్ప సినిమాతో బన్నీకి ఎలా అయితే క్రేజ్ వచ్చిందో.. నానికి కూడా అదే రేంజ్ ఫాలోయింగ్, డిమాండ్ ఏర్పడుతుంది. అప్పుడు నాని తన రెమ్యూనరేషన్‌ను మరింతగా పెంచుకోవచ్చు. ఒక వేళ దసరా బెడిసి కొడితే మాత్రం నాని ఆశలన్నీ గల్లంతవుతాయి. ఇప్పటి వరకు వదిలిన పాటలు, టీజర్, ట్రైలర్‌ను చూస్తే మాత్రం ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనిపిస్తోంది. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?
Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook