Nayan Sarika about Aay: ఎన్నో పెద్ద సినిమాల మధ్య విడుదలైన కానీ..‘ఆయ్’ సినిమా వాటన్నిటికన్నా.. మంచి విజయం అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని…ఈ సినిమా రుజువు చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా చేయగా.. హీరోయిన్గా నయన్ సారిక నటించింది. విరుదలై రెండు వారాలైనా కానీ.. ఈ సినిమా ఇంకా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా పరుగులు తీస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది హీరోయిన్ నయన్ సారిక. ముఖ్యంగా తనపై తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలను తెలియజేసింది.
నయన్ సారిక మాట్లాడుతూ..‘‘తెలుగు సినీ ప్రేక్షకులు మా ఆయ్ ను ఇంతలా ఆదరించినందుకు ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమాతో నా కెరియర్ మొదలవ్వడం ఆనందంగా ఉంది. ఒక సినిమా విజయం అనేది ఆ చిత్ర మొత్తం యూనిట్ కి సంబంధించింది. కానీ ‘ఆయ్’ విజయం నాకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇంత విజయవంతమైన చిత్రంలో నన్ను కూడా బాగం చేసినందుకు గీతాఆర్ట్స్ సంస్థకు, దర్శకుడు అంజి కె.మణిపుత్రకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది.
డిగ్రీ చదువుతుండగానే నయన్ సారికకు ఈ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. సినిమాలలో నటించాలని ఎప్పటినుంచో కలగన్న నయన్ ఈ చిత్ర అవకాశంలో.. ‘ఆయ్’ సినిమా షూటింగ్లో పాల్గొంటూనే.. తన డిగ్రీ చివరి సంవత్సరం ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యింది. ఇదే విషయం గురించి చెబుతూ.. ‘‘సినిమా షూటింగ్ కి నేను నా మెటీరియల్ తీసుకెళ్లేదాన్ని. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు పూర్తి చేయటానికి నేను క్యారీవ్యాన్‌లో షూటింగ్ గ్యాప్‌లో చదువుకుంటుండేదాన్ని. సినిమా షూటింగ్ చేస్తూనే నా ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చింది.
“‘ఆయ్’ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన తర్వాత.. మేమందరం కలిసి అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లను కలుసుకున్నాము. సినిమా సక్సెస్‌పై జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ టీమ్ సభ్యులను.. అభినందించారు,” అని చెప్పకు వచ్చింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తన నటనను ప్రశంసించారు అని చెబుతూ ఆనందపడింది. ‘‘సినిమాలో చాలా ఈజ్‌తో నా క్యారెక్టర్లో కనిపించాను అంటూ ఎన్టీఆర్‌గారు ఎంతగానో అభినందించారు. అల్లు అర్జున్ గారు దక్షిణాది అమ్మాయి అనే అనుకున్నారంట. నేను కాదని తెలిసి అంత చక్కగా పాత్రలో ఒదిగిపోయినందుకు ఆశ్చర్యపోయారు. వారిద్దరి దగ్గర నుంచి ప్రశంసలు రావటం నాకెంతో ఆనందం అనిపించింది’’ అని చెప్పుకొచ్చింది నయన్ సారిక.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.