F3 First Lyrical Song: 'ఎఫ్ 3' ప్రమోషన్స్ షురూ.. 'లబ్ లబ్ లబ్ డబ్బు' సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

F3 First Lyrical Song: వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధానపాత్రల్లో అనిల్ రావిపూడి దరకత్వంలో తెరకెక్కుతోన్న 'ఎఫ్ 3' చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని సమ్మర్ లో ప్రేక్షకులను అలరిచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ప్రారంభించేందుకు నిర్మాతలు నిర్ణయించారు. అందులో భాగంగా సినిమాలోని తొలి పాట 'లబ్ లబ్ లబ్ లబ్ డబ్బు' పాటను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 12:23 PM IST
    • ప్రమోషన్స్ షురూ చేసిన 'ఎఫ్ 3' మూవీ మేకర్స్
    • సినిమాలోని ఫస్ట్ సాంగ్ రిలీజ్ కు ముహుర్తం ఖరారు
    • ఫిబ్రవరి 7న ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటన
F3 First Lyrical Song: 'ఎఫ్ 3' ప్రమోషన్స్ షురూ.. 'లబ్ లబ్ లబ్ డబ్బు' సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

F3 First Lyrical Song: సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి నుంచి విపరీతమైన స్పందన లభించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ ఫ్యాన్స్ తో పాటు కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. 'ఎఫ్ 2'కు మూడు రెట్లు ఎక్కువ వినోదంతో ఈ సీక్వెల్ 'ఎఫ్ 3' సినిమాు రూపొందిస్తున్నట్లు చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. 

అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావించినా.. ఆ సమయంలో పాన్ ఇండియా సినిమాలు ప్రభావంతో వాయిదా పడింది. ఇప్పుడీ సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 28న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్ణయిస్తూ ఇటీవలే అధికారిక ప్రకటన కూడా చేశారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించారు. 'లబ్ లబ్ లబ్ లబ్ డబ్బు' సాంగ్ ను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను గురువారం చిత్రబృందం విడుదల చేసింది.   

వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ సరసన హీరోయిన్లుగా తమన్నా, మెహరీన్ నటిస్తున్నారు. వీరితో పాటు మరో అందాల హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉన్నట్లు సమాచారం. సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  

Also Read: Pooja Hegde Photos: సంప్రదాయ దుస్తుల్లో ఎంత ముద్దుగున్నావే బుట్టబొమ్మ!

Also Read: Vanitha Vijayakumar Marriages: కన్న తండ్రే క్రూరంగా ప్రవర్తించాడు.. మూడు పెళ్లిళ్లకు కారణం అదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News