Bimbisara 2: బింబిసార ప్రీక్వెల్ నుంచి వశిష్ఠ ఎందుకు తప్పుకున్నట్టు..? మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..

Bimbisara 2: కళ్యాణ్ రామ్.. నందమూరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎపుడు ఇమేజ్ బిల్డప్స్ కు పోకుండా.. సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా ఈయన తన పుట్టినరోజు సందర్బంగా బింబిసార 2 సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అయితే వశిష్ఠ ప్లేస్ లో కొత్త దర్శకుడితో ఈ ప్రీక్వెల్ చేస్తుండటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 5, 2024, 12:58 PM IST
Bimbisara 2: బింబిసార ప్రీక్వెల్ నుంచి వశిష్ఠ ఎందుకు తప్పుకున్నట్టు..? మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..

Bimbisara 2: కళ్యాణ్ రామ్ నందమూరి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో చేసిన ‘బింబిసార’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత  ‘అమిగోస్’, ‘డెవిల్’ సినిమాలతో పలకరించారు. ఈ సినిమా స్టోరీలు బాగున్నా.. బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాలు అందుకోలేకపోయాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా తన పుట్టినరోజు సందర్బంగా ‘బింబిసార 2’ అనౌన్స్ చేసాడు. ఈ సినిమాను ‘బింబిసార’ ను డైరెక్ట్ చేసిన వశిష్ఠను కాకుండా..అనిల్ పాదూరి డైరెక్ట్ చేస్తున్నాడు.

అయితే.. వశిష్ఠను కాకుండా రొమాంటిక్ సినిమా డైరెక్టర్ అనిల్ పాదూరిని ఎందుకు తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ ల కారణంగా ఈ సినిమా నుంచి వశిష్ఠ తప్పుకున్నట్టు సమాచారం. మరి అనిల్ పాదూరి ఈ సినిమాను ఎలా డీల్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

అయితే.. ఈ సినిమాను సీక్వెల్ కాకుండా... ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు. అయితే.. బింబిసార కథ ముందు ఏం జరిగిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మొత్తంగా ‘బింబిసార’ ప్రీక్వెల్ ను ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.మొత్తంగా 'బింబిసార' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం కళ్యాణ్ రామ్ వెయిట్ చేస్తున్నాడు. హీరోగా కళ్యాణ్ రామ్‌కు ఇది 22వ సినిమా. నటుడిగా 25వ చిత్రం కావడం గమనార్హం.  మరోవైపు కళ్యాణ్ రామ్ నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. నిర్మాతగా ‘దేవర’, ‘డ్రాగన్’ సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా ఈ సినిమాలతో కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం.

Also read: Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News