Pooja Ramachandran : తల్లైన బిగ్ బాస్ బ్యూటీ.. అప్పుడే పేరు పెట్టేసిన సార్పట్ట విలన్

Pooja Ramachandran Blessed With Baby Boy పూజా రామచంద్రన్ తాజాగా తల్లైంది. పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చింది. తన బిడ్డను చూసుకుని జాన్ కొక్కెన్ మురిసిపోతోన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఆ బిడ్డకు పేరు కూడా పెట్టేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2023, 07:15 PM IST
  • తల్లైన పూజ రామచంద్రన్
  • కొడుకు పుట్టాడని చెప్పిన విలన్
  • అప్పుడే పేరు పెట్టిన జాన్ కొక్కెన్
Pooja Ramachandran : తల్లైన బిగ్ బాస్ బ్యూటీ.. అప్పుడే పేరు పెట్టేసిన సార్పట్ట విలన్

Pooja Ramachandran Blessed With Baby Boy బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్, సార్పట్ట విలన్‌లు గత కొన్ని రోజులుగా సంతోషంలో మునిగిపోతూ వచ్చారు. పూజా రామచంద్రన్ తన బేబీ బంప్‌తో రకరకాల ఫోటో షూట్లు చేసిన సంగతి తెలిసింది. తాను తండ్రిని అయినట్టుగా జాన్ కొక్కెన్ ప్రకటించాడు. పూజా రామచంద్రన్‌కు పండంటి మగ బిడ్డ పుట్టాడు. అప్పుడే ఆ బిడ్డకు పేరు కూడా పెట్టారు. కియాన్ కొక్కెన్ అంటూ పేరు పెట్టినట్టుగా జాన్ కొక్కెన్ ప్రకటించాడు.

బిగ్ బాస్ రెండో సీజన్‌లో పూజా రామచంద్రన్ వైల్డ్ కార్డ్‌గా వచ్చి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మగ కంటెస్టెంట్లకు ధీటుగా టాస్కులు ఆడి బాగానే గెలిచింది. ఇంట్లోకి వచ్చిన మొదట్లో కౌశల్‌కు సన్నిహితంగానే ఉంది. ఆ తరువాత కౌశల్‌కు వ్యతిరేకంగా మారింది. దీంతో కౌశల్ ఆర్మీ దెబ్బకు ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by John Kokken (@highonkokken)

పూజా రామచంద్రన్ ప్రేమ, పెళ్లి వ్యవహారాలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. నటుడు జాన్ కొక్కెన్‌తో పెళ్లి తరువాత పూజా రామచంద్రన్ లైఫ్ కాస్త ప్రశాంతంగానే సాగినట్టు అనిపిస్తోంది. పూజా రామచంద్రన్, జాన్ కొక్కెన్‌లు వేసే వెకేషన్లు, షేర్ చేసే ఫోటో షూట్లు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. ఇక గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరూ తల్లిదండ్రులు కాబోతోన్న సంగతిని సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నారు.

Also Read: Kriti Sanon Sita Posters : అశోకవనంలో సీత.. ఆదిపురుష్ నుంచి కృతి సనన్ లుక్.. పిక్స్ వైరల్

పూజా రామచంద్రన్ బేబీ బంప్‌తో తన భర్తతో కలిసి షేర్ చేసిన ఫోటో షూట్లు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ఇప్పుడు పూజా రామచంద్రన్ తల్లి అయింది. ఈ విషయాన్ని జాన్ కొక్కెన్ సోషల్ మీడియాలో పోస్ట్ వేసి చెప్పుకొచ్చాడు. మా చిట్టిబాబు వచ్చాడు.. మా జీవితాల్ని పరిపూర్ణం చేసి, మాకు సంతోషాన్ని ఇచ్చే బాబు మా జీవితంలోకి వచ్చాడు.. కియాన్ కొక్కెన్‌కు ఈ ప్రపంచంలోకి స్వాగతాన్ని చెబుతున్నాం.. మీ అందరి ప్రేమాభిమానాలకు థాంక్స్.. అంటూ జాన్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Also Read:  Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News