Prabhas Birthday: ప్రభాస్ ఫ్యాన్స్ ఆ రోజు కోసం వేచి చూస్తున్నారు!

Radhe Syam Updates : బాహుబలి ప్రభాస్( Prabhas) అభిమానులకు అక్టోబర్ 23 తేదీ చాలా ప్రత్యేకం. ఆ రోజు ప్రభాస్ పుట్టిన రోజు. 

Last Updated : Oct 8, 2020, 02:30 PM IST
    • బాహుబలి ప్రభాస్ అభిమానులకు అక్టోబర్ 23 తేదీ చాలా ప్రత్యేకం.
    • ఆ రోజు ప్రభాస్ పుట్టిన రోజు.
    • ప్రస్తుతం సెలబ్రిటీలు తమ పుట్టిన రోజున కీలకమైన అప్డేట్స్ షేర్ చేయడం అనేది సాధారణ విషయంగా మారింది.
Prabhas Birthday: ప్రభాస్ ఫ్యాన్స్ ఆ రోజు కోసం వేచి చూస్తున్నారు!

Adipurush Updates : బాహుబలి ప్రభాస్( Prabhas) అభిమానులకు అక్టోబర్ 23 తేదీ చాలా ప్రత్యేకం. ఆ రోజు ప్రభాస్ పుట్టిన రోజు. ప్రస్తుతం సెలబ్రిటీలు తమ పుట్టిన రోజున కీలకమైన అప్డేట్స్ షేర్ చేయడం అనేది సాధారణ విషయంగా మారింది. ఇలాంటి సమయంలో ప్రభాస్ కూడా తన పుట్టిన రోజు సందర్బంగా ఏదైనా అప్డేట్ ఇస్తాడేమో అని అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు భారీ చిత్రాలకు కమిట్ అయ్యాడు. ఈ మూడు చిత్రాలు ప్యాన్ ఇండియా సినిమాలే. 

ALSO READ : GRAND ICT Challegne: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఛాలెంజ్ పూర్తి చేస్తే.. రూ.50 లక్షలు మీకే సొంతం

ప్రస్తుతం రాధేశ్యామ్ ( Radhe Shyam ) మూవీ షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. ఆదిపురుష్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రం గురించే ఫ్యాన్స్ కాస్త నిరాశగా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు గురించి ఒక హీరోయిన్ పాత్రలో దీపికా పదుకొణె ( Deepika Padukone ) ఎంపికైన విషయం తప్పా.. మరే విషయం తెలియలేదు. 

పైగా నాగ్ అశ్విన్ ఒక వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు అని ప్రభాస్ ఫ్యాన్స్ దిగులు పడుతున్నారు. అయితే దీనిపై నాగ్ అశ్విన్ స్పందించాడు. అభిమానులకు శుభవార్త పక్కా అన్నాడు. అయితే ఆ అప్డేట్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మాత్రం ఆక్టోబర్ 23 వరకు వేచి చూడాల్సిందే.

రాధేశ్యామ్ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉండటంతో... ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ వచ్చే అవకాశం కూడా ఉంది. దాంతో రాధేశ్యామ్ ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా మొదలు అయ్యే ఛాన్స్ ఉంది. 

ALSO READ| Cricketers Talent: మన క్రికెటర్లు క్రికెటర్స్ కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో తెలుసా?

రాధేశ్యామ్ చిత్రంతో పాటు ప్రస్తుతం ఆదిపురుష్ ( Adipurush ) చిత్రంపై కూడా అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. డార్లింగ్ ప్రభాస్ ఈ మూవీలో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఫైనల్ అయ్యారు. ఇక మిగిలిన పాత్రలు, అంటే సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడి పాత్రలో ఎవరు కనిపించనున్నారో ప్రభాస్ పుట్టిన రోజున తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ప్రభాస్ పుట్టిన రోజు కీలక అప్డేట్స్ వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో అభిమానులు ఆ రోజు కోసం వేచి చూస్తున్నారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News