Kalki Part 2: కల్కి-2కు చేంజ్ అవ్వనున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఈసారి ఏకంగా ఆస్కార్ విన్నర్?

Kalki 2898AD collections: నాగ్ అశ్విన్.స దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం మొదటి భాగాన్ని అర్ధాంతరంగా ముగించడంతో.. ఈ సినిమా రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఈ సినిమా రెండో భాగం గురించి ఒక అప్డేట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 30, 2024, 05:34 PM IST
Kalki Part 2: కల్కి-2కు చేంజ్ అవ్వనున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఈసారి ఏకంగా ఆస్కార్ విన్నర్?

Kalki Part 2 Update: ప్రస్తుతం స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలు అన్నీ కూడా.. సీక్వెల్స్ తో ముందుకు సాగుతున్నాయి. చాలామంది స్టార్ డైరెక్టర్స్.. మొదటి భాగాన్ని అర్ధాంతరంగా ముగించి.. తరువాత ఏమవుతుంది అని ఇంట్రెస్ట్ ప్రేక్షకుల మధిలో ఉంచుతున్నారు. అందుకే ఈ చిత్రాల రెండో భాగం పై అంచనాలు ఆకాశాన్ని చేరుతున్నాయి. ఇక ఇదే ఫార్ములా ఫాలో అయ్యింది ప్రభాస్ కల్కి సినిమా. ప్రభాస్ ని కర్ణుడిగా పరిచయం చేయడంతో ఈ చిత్రం మొదటి భాగం ముగిసింది. 

క్లైమాక్స్ లో ప్రభాస్ ని కర్ణుడిగా చూసి.. ప్రేక్షకులు ఈ సినిమా రెండో భాగం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర రెండో భాగం గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.

కాగా ఈ సినిమాలో దర్శకుడి ప్రతిభ ..ప్రభాస్ పెర్ఫార్మెన్స్.. అన్నిటిని మెచ్చుకుంటున్న ప్రేక్షకులు.. ఒక్క విషయాన్ని మాత్రం విమర్శిస్తున్నారు. అదేమిటంటే ఈ సినిమా సంగీతం. మొదటినుంచి సంతోష్ నారాయణ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అంటూ వచ్చారు అందరూ. ఇక సినిమా చూశాక కూడా అదే రుజువయింది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు తమ బెస్ట్ ఇస్తే.. సంతోష్ నారాయణ మాత్రం తన వరస్ట్ ఇచ్చారంటూ కామెంట్స్ రాసాగాయి. 

ఈ క్రమంలో ఇప్పుడు రెండో భాగానికి తప్పకుండా దర్శకుడు ఈ తప్పు రిపీట్ చేసేలా కనిపివ్వడం లేదు. ఎందుకంటే నాగ్ అశ్విన్.. గత చిత్రాలు ఎవరే సుబ్రహ్మణ్యం.. మహానటి రెండు కూడా మ్యూజికల్ గా మంచి విజయాన్ని సాధించాయి. కానీ ఆ మార్క్ కల్కిలో పూర్తిగా మిస్సయింది. అందుకే ఈ తప్పు జరగకూడదని రెండో భాగానికి.. ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ని అనుకుంటున్నారట చిత్ర యూనిట్. 

రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేసిన కీరవాణి ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్నారు. హాలీవుడ్‌ రేంజ్‌లో తీసిన కల్కి సినిమాకు.. ఆ రేంజ్‌లోనే మ్యూజిక్‌ డైరెక్టర్‌ను పెడితే బాగుండేదని ఇప్పటికే ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కల్కి-2లో కీరవాణి కోసం ప్రయత్నాలు మొదలయ్యాయంటున్నారు. ఐతే ప్రస్తుతం కీరవాణి బిజీగా ఉన్నారు. రాజమౌళి-మహేశ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రానికి.. కీరవాణి మ్యూజిక్‌ అందిస్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమా పూర్తయితేనే కీరవాణికి సమయం దొరుకుతుందట. మరి అప్పటివరకు కల్కి సినిమా యూనిట్ ఎదురు చూస్తుందా.. లేదా కీరవాణి రాజమౌళి సినిమాకి ఆలస్యం అవుతుంది కాబట్టి ..ముందుగా కల్కి సంగీతం అందిస్తారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.

Also Read: Rohit Sharma Retirement: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటన

Also Read: Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News