Prahlad Short Film: కృషి, పట్టుదల, వాస్తవికతకు నిదర్శనమైన 'ప్రహ్లాద్' తప్పక చూడవలసిన చిత్ర కావ్యం.

Prahlad Short Film: ఫినోలెక్స్‌ సంస్థ అద్భుతంగా నిర్మించిన " ‘ప్రహ్లాద్‌".. షార్ట్‌ ఫిల్మ్‌. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పట్టుదల, కృషి ఉంటే విజయం సాధ్యమని నిరూపించే ఈ కథకు విశేష స్పందన లభిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2022, 01:34 PM IST
  • కృషి, పట్టుదల, వాస్తవికతకు..
  • నిదర్శనమైన 'ప్రహ్లాద్' తప్పక..
  • చూడవలసిన చిత్ర కావ్యం.
 Prahlad Short Film: కృషి, పట్టుదల, వాస్తవికతకు నిదర్శనమైన 'ప్రహ్లాద్' తప్పక చూడవలసిన చిత్ర కావ్యం.

Prahlad Short Film: పి. ప్రహ్లాద్ ఛబ్రియా మొక్క జీవిత సారాంశం. 14 ఏళ్ల చిరు ప్రాయంలోనే తన జీవన గమనాన్ని నిర్ధేశించుకుని సంపద సృష్టికర్త. చిన్న తనం నుంచే ప్రహ్లాద్‌ భక్తి, దయతో పాటు లక్ష్యాన్ని చేరుకోవటానికి కావాల్సిన దారిని ఎంచుకున్నాడు. ప్రణాళిక బద్ధంగా కష్టపడితే సంపద దానంతట అదే సృష్టించవచ్చని నిరూపించారు. భారతదేశంలో ఒక అత్యంత విశ్వసనీయ వ్యాపారవేత్తగా గుర్తింపుపొందిన దివంగత శ్రీ ప్రహ్లాద్ పి. ఛబ్రియా ఫినోలెక్స్‌ గ్రూపును అగ్రభాగాన నిలపడంలో నిరంతర తపన చెందాడు. ఫినోలెక్స్‌ గ్రూపు వ్యవస్థాపకుడిగా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన ఆయన PVC పైపులు మరియు ఇతర విడిభాగాల తయారీలో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మిలియన్‌ డాలర్‌ ఆలోచనలతో జీవన సాఫల్యాన్ని పొందిన ఆదర్శనీయుడి జీవన వృత్తాంతమే ఈ లఘు చిత్రం. శ్రీ ప్రహ్లాద్‌ ఛబ్రియా జీవిత కథ ఆధారంగా రూపొందిన"ప్రహ్లాద్".. లఘు చిత్రం.. విశేష ప్రజాదరణ పొందిన షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో అగ్రభాగన నిలిచింది. ష్బాంగ్‌ మోహన్‌ ఫిక్చర్స్‌ సహకారంతో ఫినోలెక్స్‌ గ్రూపు నిర్మించిన "ప్రహ్లాద్‌" లఘు చిత్రం ఆయన స్మృత్యర్థం సెప్టెంబర్‌ 1 నుంచి యూట్యూబ్‌ ప్రిమియర్‌లోనూ విడుదల చేసింది. ఈ లఘు చిత్రం ఎందరో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రేరణగా, మార్గదర్శకంగా నిలుస్తోంది. భారత వ్యాపార సామ్రాజ్యంలో రాణించాలనుకున్న వారికి దిక్చూచిగా ఉంది.

1945లో అమృత్‌సర్‌కు చెందిన 14ఏళ్ల కుర్రాడు.. చిరుప్రాయంలోనే తండ్రి ఆశయాలను, ఆలోచనలను భుజాన వేసుకున్న ధైర్యవంతుడు, దృఢ సంకల్పంతో అంచెలంచెలుగా ఎదిగిన యువకుడి విజయగాథ ఈ చిత్ర కథాంశం జీవన గమనంలో పైకిరావాలనుకున్న ఎందరికో దారిచూపే భావోద్వేగాలను రగిలించడంలో " ప్రహ్లాద్‌" కథ విజయవంతమైంది.   ప్రహ్లాద్ ఛబ్రియ తండ్రిగారు 39ఏళ్లకే  చనిపోవటంతో కుటుంబ బాధ్యతలు, పోషణ భారం మీదపడినా మొక్కవోని  ధైర్యంతో ముందడుగు వేశారు.  కేవలంలో రూ.10తో వ్యాపారాన్ని ప్రారంభించి  10,000 కోట్ల సువిశాల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. సంపదను సృష్టించడంలో విలువలు, నాణ్యతకు రాజీపడని మొండి మనిషిగా కూడా ఈ లఘుచిత్రం పవర్‌ పుల్‌ సందేశాన్ని ప్రేక్షకులకు అందిస్తోంది. ఒక సాధారణ  దిగువ తరగతి యువకుడి  పట్టుదల, మేధస్సు, పోరాటాలు కళ్లముందు కదలాడేలా 'ఫినోలెక్స్‌ గ్రూపు' ఈ చిత్రాన్ని చిత్రీకరించింది. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విజయవంతంగా యూట్యూబ్‌లో ప్రేక్షకాదరణ పొందుతూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్‌ 1న విడుదలైన ఈ చిత్రం తొలిరోజే ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ అయ్యింది. 'సెలబ్రేటింగ్ ప్రహ్లాద్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎంతో మంది చిత్ర విజయాన్ని ట్వీట్  చేశారు.

నమ్మిన సిద్ధాంతం, ఆదర్శవంతమైన విలువలతో ఒక వ్యాపార సామ్రాజాన్ని సృష్టించి ప్రహ్లాద్‌ జీవిత కథ ఆధారంగా చిత్రీకరించిన ఈ లఘు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యూట్యూబ్‌ ప్రీమియర్లో ప్రసారం అవుతున్న ఈ లఘు చిత్రంపై ఎందరో సమీక్షకులు తమ సమీక్షను అందించారు. ట్విట్టర్‌, ఇతర సోషల్‌ మీడియా వేదికగా గొప్ప సమీక్షలను వ్యక్త పరిచారు. ఫినోలెక్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ప్రహ్లాద్ పి ఛబ్రియా జీవిత వృత్తాంతం నుంచి ష్బాంగ్‌ మోహన్‌ ఫిక్చర్స్‌ ప్రేరణ పొందింది. "మేము నిరంతరం శక్తిమంతమైన కథల కోసం అన్వేషిస్తున్న క్రమంలో మానవత్వపు విలువులు, సమానత్వం ఉన్న ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి కథ లభించడం ఎంతో ఉన్నతమైందని" ష్బాంగ్‌ మోహన్‌ ఫిక్చర్స్‌  అధినేత నిర్మాత హర్షిల్ కరియా అన్నారు. పెద్ద పెద్ద హాలీవుడ్‌ చిత్రాలను తలతన్నే రీతిలో ఈ చిత్ర కథాంశం ఉందని మేము హామీ ఇస్తున్నామని ష్బాంగ్‌ మోహన్‌ ఫిక్చర్స్‌  అధినేత చెప్పారు. 14 వయస్సులో తన  జీవిత గమనాన్ని నిర్ధేశించుకుని విజయవంతమైన ఒక యువకుడి అసాధారణ పట్టుదల ఎందరో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆదర్శమైంది. "ప్రహ్లాద్" లఘు చిత్రం ఎందరో భారతీయ పారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తిదాయకమైన అధ్యయనంగా చెప్పవచ్చు.

ప్లంబింగ్, ఎలక్ట్రికల్‌ పరికరాల తయారీలో అతిపెద్ద సంస్థ అయిన ఫినోలెక్స్‌ గ్రూపు ఈ లఘ చిత్రాన్ని నిర్మించింది. ఫినోలెక్స్‌ గ్రూపు ఇతర తయారీ రంగాల్లోనూ తనదైన ముద్ర వేసింది. విద్యుత్ మరియు టెలికమ్యూనికేషన్ ఉత్పత్తులు, కేబుల్స్ మరియు పాలీ వినైల్ క్లోరైడ్ షీట్లు, అంతర్గత, సాంకేతిక రంగాల్లో ఫినోలెక్స్‌ గ్రూపు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. సాంకేతిక బలాన్ని పెంచుకుంటూ భవిష్యత్‌లో మరెన్నో నూతన తయారీ విభాగాల్లో పెట్టుబుడులు పెట్టేందుకు ఫినోలెక్స్‌ గ్రూపు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నాణ్యమైన ఉత్పత్తులు, ముడిపదార్థాలు, రవాణా, పంపిణీ, నిల్వ వంటి రంగాల్లో కంపెనీ అపార నైపుణ్యాన్ని పొందింది. ఒక విజయవంతమైన వ్యాపారవేత్త యొక్క మనస్తత్వం మరియు ఆలోచన ప్రక్రియ కథతో ప్రతిధ్వనిస్తుంది.

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Blood Purifying Foods: ఈ ఆహారాలను తీసుకోండి.. రక్తాన్ని శుద్ధి చేసి అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News