Hanu Man Creats New History: రికార్డుల పరంపర.. 92 ఏళ్ల చరిత్రను తిరగరాసిన 'హనుమాన్‌'

Prashanth Varma, Teja Sajja: చిన్న సినిమాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా 'హనుమాన్‌' సత్తా చాటుతోంది. దేశ, విదేశాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిత్రం అదే రీతిలో రికార్డులను నెలకొల్పుతున్నది. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు భారత చిత్రసీమలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. తాజాగా తెలుగు సినీ చరిత్రలో 92 ఏళ్ల రికార్డును 'హనుమాన్‌' అధిగమించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 2, 2024, 11:12 PM IST
Hanu Man Creats New History: రికార్డుల పరంపర.. 92 ఏళ్ల చరిత్రను తిరగరాసిన 'హనుమాన్‌'

Tolllywood History: కథను ప్రధానంగా నమ్మి సంక్రాంతి బరిలో అగ్ర కథానాయకులతో పోటీ పడి గెలిచిన సినిమా పందెం కోడి 'హనుమాన్‌' సినిమా. సంక్రాంతి పండుగను విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ యాభై రోజుల దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. సినిమా విడుదలై కలెక్షన్లతోపాటు రికార్డులను నమోద చేస్తూ దేశంలోని సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ నటించిన 'హనుమాన్‌' చిత్రం తాజాగా తెలుగు సినీ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది.

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న 92 ఏళ్ల రికార్డును 'హనుమాన్‌' అధిగమించింది. ఈ విషయాన్ని చిత్రబృందం స్వయంగా ప్రకటిస్తూ హర్షం వ్యక్తం చేసింది. సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాల జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా హనుమాన్‌ నిలిచింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. 'ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ప్రేమతో హనుమాన్‌ చరిత్ర సృష్టించింది. 92 సంవత్సరాల తెలుగు సినీ పరిశ్రమల ప్రస్థానంలో ఆల్‌టైమ్‌ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది' అని చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది.

భారీగా కలెక్షన్లు
జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.278 కోట్లకు పైగా హనుమాన్‌ కలెక్షన్లు సాధించింది. ఇంకా కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్‌' తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పనులు మొదలయ్యాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించారు. ఈ సీక్వెల్‌లో తేజ సజ్జతో పాటు బాలీవుడ్‌తోపాటు తెలుగులోని స్టార్‌ హీరోలను అనుకుంటున్నారు. హనుమాన్‌ భారీ విజయంతో సీక్వెల్‌పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది.

 

Also Read: Gaddar Awards: 'గద్దర్‌ అవార్డు'లపై సినీ పరిశ్రమ మౌనం.. తొలిసారి మోహన్‌ బాబు ఏమన్నారంటే..?

Also Read: KTR Letter To Revanth: ఆటో డ్రైవర్లు చస్తుంటే కనికరం లేదా సీఎం రేవంత్‌ రెడ్డి? మాజీ మంత్రి కేటీఆర్‌ లేఖ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x