Baby Leaks: బేబీ మూవీ డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు.. సాక్ష్యాలతో ‘బేబీ లీక్స్’ బుక్‌.. ఇండస్ట్రీలో పెను దుమారం

Baby Movie Copy Issue: బేబీ మూవీ దర్శకుడు సాయి రాజేష్ తన కథతో సినిమా తీశారని డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ సాక్ష్యాలతో మీడియా ముందుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన బేబీ లిక్స్ అనే బుక్‌ను ఆయన మీడియా ముందుకు తీసుకువచ్చారు. పూర్తి వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2024, 05:42 PM IST
Baby Leaks: బేబీ మూవీ డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు.. సాక్ష్యాలతో ‘బేబీ లీక్స్’ బుక్‌.. ఇండస్ట్రీలో పెను దుమారం

Baby Movie Copy Issue: సూపర్ హిట్‌గా నిలిచిన బేబీ మూవీపై సంచలన ఆరోపణలు చేశారు ప్రేమించొద్దు సినిమా డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్. తన కథను కాపీ కొట్టి బేబీ సినిమాగా దర్శకుడు సాయి రాజేష్‌ రూపొందించారని.. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకం తీసుకువచ్చినట్లు తెలిపారు. అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస కీలక పాత్రల్లో శిరిన్ రామ్ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘ప్రేమించొద్దు’. పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో ఈ సినిమాను రూపొందించగా.. తెలుగు వర్షన్‌ను జూన్ 7న ఆడియన్స్ ముందుకు తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో శిరిన్ శ్రీరామ్ తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చారు. బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందు చూపించారు.

Also Read: Google maps: కొంప ముంచిన గూగుల్ తల్లి.. హైదరాబాద్ టూరిస్టులకు ఊహించని షాక్..

రవి కిరణ్ అనే వ్యక్తిని తాను 2015లో కలిశానని చెప్పారు. ఆయన Facebookలో పెట్టిన పోస్ట్ చూసి.. ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు కలిసి చంపారనే పోస్ట్ చూసి ఓ స్టోరీ అనుకున్నానని తెలిపారు. బస్తీ అమ్మాయి క్యారెక్టర్ చుట్టూ కథ రాసుకున్నానని.. ఆ సమయంలోనే ప్రొడ్యూసర్ సాయి రాజేష్‌తో ఏడాది జర్నీ చేశానని అన్నారు. తనకు దర్శకుడిగా అవకాశం కల్పించి.. ఆయనే సినిమా నిర్మిస్తానని చెప్పారని తెలిపారు. అయితే ఆలస్యం కావడం.. ఆయన సినిమాను నిర్మించడం లేదని తాను బయటకు వచ్చానని చెప్పారు. అప్పుడు తమకు గొడవ ఏమీ జరగలేదని.. దర్శకుడిగా తరువాత అవకాశం ఇస్తానని మాటిచ్చారని అన్నారు. తన కథను కాపీ కొట్టి.. అదే బస్తీ అమ్మాయి ఇద్దరు అబ్బాయిలను ప్రేమించిన కథతో బేబీ అనే బూతు సినిమా తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"2023 జూలైలో బేబీ చిత్రం విడుదలైనప్పుడు నేను రచ్చ చేయలేదు. నాకు సెట్ అవ్వడానికి సమయం పట్టింది. అన్ని సాక్ష్యాలు తీసుకుని లాయర్ నిఖిలేష్‌ను కలిశాను. ముందు కాపీ రైట్ లీగల్ నోటీసులు పంపించాం. కానీ ఆయన ఆ బేబీ స్టోరీని నాకు చెప్పారని రిప్లై ఇచ్చారు. హృదయం కాలేయం సినిమాకు నేను ఫ్రీగా టీజర్ డైరెక్ట్ చేశా. అంతేకాకుండా ఎడిట్ చేసి ఇచ్చా. సహాయం చేసిన వాళ్లకే వెన్నుపోటు పొడిచే రకం వ్యక్తి. ఫిబ్రవరి నెలలో నేను రాయదుర్గంలో కేసు ఫైల్ చేశాను. అయితే నన్ను బద్నాం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదులు చేశారు. నేను ఆయన మీద బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశాను. https://babyleaks2023.blogspot.com/ అనే వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ కూడా ఉంది. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు.." అని శిరిన్ రామ్ చెప్పుకొచ్చారు. 

అనంతరం రవి కిరణ్ మాట్లాడుతూ.. పోలీసులు, కోర్టు, మీడియా వల్ల న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని.. 2012 నుంచి శిరీన్‌తో తనకు పరిచయం ఉందన్నారు. తాను 2015లో ఓ పేపర్ ఆర్టికల్ చూసి పోస్ట్ చేశానని.. ఆ చిన్న ఆర్టికల్‌ను చూసి శిరీన్ తనకు కాల్ చేశారని చెప్పారు. కథగా మార్చి సినిమా తీద్దామని.. ఒక అమ్మాయి ఇద్దర్ని ప్రేమించింది.. ఆ ఇద్దరూ కలిసి అమ్మాయిని చంపే ప్రయత్నం చేస్తారనే పాయింట్‌తో స్టోరీ రాసుకున్నారని తెలిపారు. స్కూల్ ఏజ్ అమ్మాయితే బాగుంటుందని, అబ్బాయిల్లో ఒకరు రిచ్, ఒకరు పూర్ అయితే బాగుంటుందని శిరీన్ ఆ రోజే తనకు చెప్పారని గుర్తు చేసుకున్నారు. తాను లై డిటెక్షన్‌కు సిద్దమని.. సాయి రాజేష్ సిద్దమా..? అని ప్రశ్నించారు. శిరీన్ డ్రీమ్‌ను సాయి రాజేష్ నాశనం చేశారని.. మీడియానే న్యాయం చేయాలని కోరారు. 

Also Read: Realme Narzo N55 Price Cut: చెప్పుల ధరకే 64MP AI కెమెరా  Realme Narzo N55 పొందండి.. డిస్కౌంట్‌ పూర్తి వివరాలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News