Cinema lover day : రూ. 99కే సినిమా చూడొచ్చు.. పీవీఆర్ బంపర్ ఆఫర్

Cinema lover day special జనవరి 20న సినిమా లవర్స్ డే కావడంతో ఓ స్పెషల్ ఆఫర్‌ను పీవీఆర్ సంస్థ ప్రకటించింది. ఆ ఒక్క రోజు మాత్రం రూ. 99లకే టికెట్లు అమ్ముతారట. ఆ రేటులోనే ఇష్టమొచ్చిన సినిమాలను చూడొచ్చని పీవీఆర్ ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2023, 03:27 PM IST
  • సినిమా లవర్స్‌కు బంపర్ ఆఫర్
  • జనవరి 20న స్పెషల్ ఆఫర్
  • పీవీఆర్‌లో రూ. 99కే సినిమా
Cinema lover day : రూ. 99కే సినిమా చూడొచ్చు.. పీవీఆర్ బంపర్ ఆఫర్

PVR Bumper offer Cinema lover day special ప్రస్తుతం టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఓ ఫ్యామిలీ మల్టీ ప్లెక్సుల్లో సినిమాలు చూడాలంటే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిందే. అయితే ఇప్పుడు పీవీఆర్ సినిమాస్ సంస్థ ఓ ఆఫర్ ఇచ్చింది. సినిమా లవర్స్ డే స్పెషల్ అంటూ జనవరి 20న రూ. 99కే టికెట్లను విక్రయించబోతోన్నారట. ఈ దెబ్బతో అవతార్‌ను కూడా వంద రూపాయలతోనే మల్టీ ప్లెక్సులో చూసే అవకాశం దక్కినట్టు అయింది.

అసలే ఇప్పుడు సంక్రాంతి సినిమాల సందడి నడుస్తోంది. ఈ క్రమంలో మన హీరోల సినిమాలకు విపరీతంగా టికెట్ రేట్లు పెంచుకున్నారు. సంక్రాంతి సందడిలో అందరూ టికెట్ రేట్ల గురించి పట్టించుకోకుండా.. సినిమాలు బాగుండటంతో ఆదరించారు. కానీ ఇవే రేట్లుకు సినిమా టాక్ తేడా కొట్టి ఉంటే.. జనాలు దారుణంగా తిరస్కరించేవారు. ఇప్పుడు టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో ఇలాంటి ఆఫర్ ఉండటంతో సినీ లవర్స్ నిజంగానే పండుగ చేసుకుంటున్నారు.
 

Trending News