Radhe Shyam Collection: రాధే శ్యామ్​ రెండు రోజుల్లో రూ.119 కోట్ల వసూళ్లు- మూడో రోజు ఎంతంటే?

 భారీ అంచనాల నడుమ ఈ నెల 11న విడుదలైన రాధేశ్యామ్ మూవీ పాజిటివ్​ టాక్​తో థియేటర్లలో సందడి చేస్తోంది. సాహో తర్వాత ప్రభాస్​ నుంచి వచ్చిన తొలి మూవి కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ ఆంశలు పెట్టుకున్నారు. పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 07:08 PM IST
  • రాధే శ్యామ్ వసూళ్ల లెక్కలు విడుదల
  • రెండు రోజుల్లో రూ.119 కోట్ల వసూళ్లు
  • ట్విట్టర్​ ద్వారా తెలిపిన మూవీ డైరెక్టర్​
Radhe Shyam Collection: రాధే శ్యామ్​ రెండు రోజుల్లో రూ.119 కోట్ల వసూళ్లు- మూడో రోజు ఎంతంటే?

Radhe Shyam Collection: భారీ అంచనాల నడుమ ఈ నెల 11న విడుదలైన రాధేశ్యామ్ మూవీ పాజిటివ్​ టాక్​తో థియేటర్లలో సందడి చేస్తోంది. సాహో తర్వాత ప్రభాస్​ నుంచి వచ్చిన తొలి మూవి కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ ఆంశలు పెట్టుకున్నారు. పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తోంది.

ఈ సినిమా తొలి రెండు రోజుల్లో రూ.119 కోట్ల బాక్స్ ఆఫీస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్​ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ద్వేశాన్ని ఎదిరించేందుకు మనకు కావాల్సింది ప్రేమ అనే క్యాప్షన్​తో రాధేశ్యామ్​ కలెక్షన్స్​కు సంబంధించిన ఓ ఫొటోను షేర్​ చేశారు.

మొత్తం కలెక్షన్ల అంచనాలు ఇలా..

సినీ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. రాధేశ్యామ్ మూవీ తొలి రోజు రూ.43.1 కోట్ల వసూళ్లు సాధించింది. ఇందులో తెలుగులో రూ.37.91 కోట్ల వసూళ్లు నమోదు చేసిందట. ఇక హిందీలో రూ.4.8 కోట్లు, తమిళంలో రూ.35 లక్షలు, మలయాళంలో రూ.4 లక్షల చొప్పున వసూళ్లు సాధించిందట.

రెండో రోజు (శనివారం) తెలుగులో రూ.24.6 కోట్ల వసూళ్లు నమోదవగా.. హిందీలో రూ.4.95 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక తమిళ్​లో రెండో రోజూ రూ.35 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మలయాళంలో రెండో రోజూ రూ.2 లక్షల వసూళ్లు మాత్రమే నమోదైనట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

మూడో రోజు అన్ని భాషల్లో కలిపి రూ.22 కోట్ల వసూళ్లు నమోదవ్వచ్చని అంచనాలు వస్తున్నాయి.

రాధే శ్యామ్ గురించి..

రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్​ సరసన పూజా హెగ్జే హీరోయిన్​గా నటించింది. ఈ మూవీలో ప్రభాస్​ హస్తసాముద్రికుడిగా కనిపించారు. 1970ల కాలంలో జరిగే లవ్​ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కింది. మూవీ చూసిన వాళ్లంతా ఇదో వీజువల్ వండర్ అంటూ పొగిడేస్తుండటం గమనార్హం. అయితే స్టోరీ పరంగా మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also read: RRR Crazy Update: డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ కానున్న తొలి భారతీయ సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్‌

Also read: Radheshyam Collections: ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్ లలో పుష్ప, భీమ్లానాయక్‌ లను దాటేసాడా..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News