Chandramukhi 2 Review: చంద్రముఖి 2 మూవీ హిట్టా? పట్టా?

Chandramukhi 2 Movie: చంద్రముఖికి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా చంద్రముఖి 2. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2023, 02:13 PM IST
Chandramukhi 2 Review: చంద్రముఖి 2 మూవీ హిట్టా? పట్టా?

Chandramukhi 2 Review: కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ 'చంద్రముఖి 2'(Chandramukhi 2). ప్రముఖ డైరెక్టర్ పి.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కరణ్ తెరకెక్కించారు. 2005లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ ఇవాళ అంటే సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్స్, మార్నింగ్ షో చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 

కొందరు ఫస్ట్ హాఫ్ బాగుందంటే.. మరికొందరు సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉందని ట్విట్టర్ వేదికగా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్ ఫెర్మారన్స్ ఇరగదీసిందని అంటున్నారు. మరోవైపు వడివేలు తన మార్కు కామెడీతో అలరించాడని..ఇక లారెన్స్ అయితే వెట్టయన్ రాజాగా తన క్యారెక్టర్ లో జీవించాడని నెటిజన్స్ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇందులో హార్రర్ సీన్స్ ఆకట్టుకున్నాయని మరో నెటిజన్స్ ట్వీట్ చేశాడు. 

ఈ మూవీలో వడివేలు, రాధికా శరత్ కుమార్, మహిమా నంబియార్, లక్ష్మి మీనన్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా వరల్డ్ వైడ్‌గా విడుదల చేశారు. ఈ మూవీ ఓటీటీ హక్కులను  ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మూవీ థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో చంద్రముఖి 2ని స్ట్రీమింగ్ చేయనున్నారు. 

Also Read: LGM Movie OTT: సైలెంట్‌గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ‘'ఎల్‌జీఎం'’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News