Rashmika remuneration: వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన. కెరీర్ ప్రారంభం నుంచి రష్మకన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. దీనితో రష్మికకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా అమె ఖాతాలో గత ఏడాది వచ్చిన పుష్ప 'మూవీ' కూడా చేరింది.
గత ఏడాది డిసెంబర్లో విడుదలైన 'పుష్ప' సినిమా అల్లు అర్జున్ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమా కాగా... అది బాక్సాఫీస వద్ద రికార్డులు సృష్టించింది. ఆ సినిమా ద్వారా అల్లు అర్జున్‌తో పాటు రష్మికకూ మంచి పేరు వచ్చింది. దీనితో ఇప్పుడు రష్మికకు అన్ని భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయి. దీనితో ఈ అమ్మడు.. అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రెమ్యునరేషన్ పెంచేసిందట.
కొత్తగా ఆమెను తమ సినమా కోసం అడుగుతున్న నిర్మాతలు, దర్శకుల నుంచి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని టాలీవుడ్ వర్గాల టాక్. గీతా ఆర్ట్స్ నుంచి ఓ ఫిమెల్ లీడ్ సినిమాకోసం రష్మికకు పిలుపు రాగా.. రూ.2-3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అడిగిందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకోసం.. గీతా ఆర్ట్స్ రష్మికకు అన్ని కోట్లు ఓకే చెప్పిందా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
రష్మిక గురించి..
రష్మిక మందాన్న 2016లో వచ్చిన కన్నడ మూవీ కిరిక్ పార్టీ సినిమాతో సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అంజనీ పుత్ర, చమక్ అనే సినిమాల్లో మెరిసింది.
ఆ తర్వాత 2018లో వచ్చిన ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అదే సంవత్సరం వచ్చిన గీత గోవిందం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం తెలుగులో ఆడవారు మీకు జోహార్లు, పుష్ప 2 సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు.. హిందీలో రెండు సినిమాల్లో హీరోయిన్గా చేస్తోంది.
Also read: Janhvi Kapoor Latest Photos: కవ్వించే ఫోటోలతో కేక పెట్టిస్తున్న జాన్వి కపూర్
Also read: Bigg Boss Brothal House: బిగ్‌బాస్ హౌస్ ఒక బ్రోతల్ హౌస్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook